39.2 C
Hyderabad
April 28, 2024 13: 59 PM
Slider జాతీయం

కర్ణాటకలో కాంగ్రెస్​కు 130పైగా సీట్లు ఖాయం

#revanthreddy

కర్ణాటకలో కాంగ్రెస్​కు 130కి పైగా సీట్లు వస్తాయని రేవంత్​రెడ్డి జోస్యం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి సీఎం కేసీఆర్​ వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికలపై మాట్లాడిన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 9 డిక్లరేషన్​లు ప్రకటిస్తామని తెలిపారు. ఆ తరువాత పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్​చాట్​ లో పాల్గొన్న ఆయన కర్ణాటకలో కాంగ్రెస్​ను ఓడించాలని కేసీఆర్ గట్టి ప్రయత్నం చేశారన్నారు. మైనారిటీ ఓట్లు జేడీఎస్​కు పడేలా బీజేపీతో కేసీఆర్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.

ఎంఐఎం మెజారిటీ స్థానాలు పోటీ చేయకుండా నిలువరించి జేడీఎస్​కు పరోక్షంగా సపోర్ట్ చేసారని ఆరోపించారు. అందుకే సీఎం కేసీఆర్​ వ్యూహాత్మకంగా మౌనం పాటించారని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో తమ పార్టీకి సుమారు 130పైగా సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి జోస్యం చేశారు. స్థానిక సర్వేలు సైతం ఇదే చెబుతున్నాయని ​పేర్కొన్నారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 9 డిక్లరేషన్​లు ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. అంతే కాకుండా సరూర్​నగర్​ సభలో ప్రకటించిన యూత్​ డిక్లరేషన్​పై క్యారాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తామని రేవంత్​ అన్నారు.

అన్ని ఆలోచించే వాగ్దానాలు

ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే తమ పార్టీ హామీలు ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్ధిక నిపుణులతో చర్చించిన అనంతరం రాష్ట్ర ఆర్ధిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకొని వాగ్దానాలు చేస్తున్నట్లు పునురుద్ఘటించారు. తాము ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వంలో లోటుపాట్లను సవరించి పారదర్శక పాలన అమలు చేస్తామని రేవంత్​ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి అసెంబ్లీకి ఒక ఐటీఐ కాలేజీ, ప్రతి పార్లమెంట్‌కు ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఓబీసీ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల డిక్లరేషన్ తర్వలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను నాటిన పోలీస్ అధికారులు

Satyam NEWS

కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ గీతం అంకితం

Satyam NEWS

మే 11 నుంచి 17 వరకూ అన్నవరం సత్యదేవుని కళ్యాణం

Satyam NEWS

Leave a Comment