29.7 C
Hyderabad
May 6, 2024 05: 26 AM
Slider ప్రత్యేకం

ఆదివారం స్పెషల్: అద్భుత రవి పుష్య యోగం

#srinivasagargeya

ఏప్రిల్ 30న  పాక్షిక  సూర్య గ్రహణం, మే 15న  సంపూర్ణ  చంద్ర గ్రహణం జరగబోతున్నాయి. ఈ రెండు అద్భుత సంఘటన మధ్య ఈ ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం రావడంతో దీన్ని రవి పుష్య యోగం అంటారు. ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంఘటన.

ఈ  సందర్బంగా పరిహారాలను పాటించి  శుభాలను పొందాలని భారత ప్రభుత్వ ఆమోదిత  దృగ్గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి  మధ్యాహ్నం 2.58 లోపు పరిహారం పాటించాలని ఆయన తెలిపారు. పైన  సూచించిన  సమయంలో కనీసం 5 తెల్ల కాగితాలు  తీసుకుని  నాలుగు అంచులకు  పసుపు  రాయాలి.

అలాగే మధ్యలో ” శ్రీ ” రాసి  దేవుడి దగ్గర  పెట్టాలి. సాయంత్రం ఆ  పేపర్లను భద్రపరుచు కోవాలి. మీరు ఏదైనా  కార్యక్రమం చేయాలనుకున్నపుడు  వాటిని  ఉపయోగించవచ్చు అని ఆయన తెలిపారు. ఈ  పేపర్లు వివాహ  కార్యక్రమాలకు నిషిద్ధం అని ఆయన వెల్లడించారు. వివాహంకు సంబంధించిన కార్యాలు తప్ప  మిగిలిన అన్ని కార్యక్రమాలకు ఇది మిక్కిలి శుభకరమని ఆయన స్పష్టం చేశారు.

Related posts

చంద్రబాబుకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు

Bhavani

ఇన్స్టా చేస్తూ యువకుడి మృతి

Bhavani

కరోనా తో భయాందోళన వద్దు జాగ్రత్తలు ముద్దు

Satyam NEWS

Leave a Comment