28.7 C
Hyderabad
May 6, 2024 02: 50 AM
Slider విజయనగరం

16 చోట్ల ఎల‌క్ట్రిక‌ల్ కాప‌ర్ వైర్ ల చోరీ..! ముగ్గురు నిందితులు అరెస్ట్.. !

#vijayanagarampolice

రోడ్ ప‌క్క‌న విద్యుత్ సంభాల వ‌ద్ద ట్రాన్స్ పార్మ‌ర్ ల‌కు  ఉన్న కాప‌ర్ ఎంత ఖ‌రీదు ఉంటుంందో మీకు తెలుసా…! గ‌డ‌చిన ఆరు మాసాల నుంచీ జిల్లాలో ప‌లు చోట్ల ఆ కాప‌ర్ వైర్ లు దొంగ‌త‌నానికి గురు అవుతున‌న్న‌ట్టు పోలీసుల‌కు ఫిర్యాదులు వ‌స్తునే ఉన్నాయి. ఇక లాభం లేద‌నుకున్న విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఎం.పాటిల్ ఆ దొంగ‌త‌నాల‌కు అడ్డుకట్ట వేయాల‌ని   ఇటీవ‌ల నిర్వ‌హించిన సెట్ కాన్ఫ‌రెన్స్ లో జిల్లాలోని అన్ని స‌ర్కిల్ కార్యాల‌యాల‌కు ఆదేశాలు ఇచ్చారు.

దీంతో విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్ పోలీస్ అధికారి అనిల్. త‌న శాఖా సిబ్బందిని అల‌ర్ట్ చేయ‌డంతో పాటు తానూ విచార‌ణ‌కై న‌డుంబిగించారు. ఈ నేప‌ధ్యంలో ముగ్గురు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. ఈమేర‌కు డీపీఓ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో డీఎస్పీ అనిల్ తో పాటు సీసీఎస్ సీఐలు కాంతారావు,శ్రీనివాస‌రావు ఎస్ఐలు జ‌యంతిలు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవ‌ల కాలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ల వ‌ద్ద కాప‌ర్ వైర్ చోరీలు జ‌రుగుతున్నాయి. పోలీస్ శాఖ‌కు వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు సీసీఎస్  సీఐలు ప‌రిశోధ‌న‌లో శ్రీకాకుళం జిల్లా నుంచీ వ‌స్తున్న ఓ కారులో ముగ్గురు వ్య‌క్తులు న‌ల్ల రంగు డ్ర‌సె వేసుకోవ‌డం అదే కారు డిక్కీలో కాప‌ర్ వైర్ ఉండ‌టాన్ని గుర్తించామ‌ని అనంతరం  త‌మ ఇంట‌రాగేష‌న్ లో కాప‌ర్ వైర్ల దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. దీంతో శంక‌ర్రావు,రాము, అప్పారాలను ప‌ట్టుకున్నామ‌ని వారి వ‌ద్ద నుంచీ  దాదాపు ల‌క్ష‌న్న‌ర‌కు పైగా విలువ చేసే కాప‌ర్ వైర్ ను  దాంతో పాటు  కారును స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

దృష్టి మ‌రల్చి చోరీలు…పోలీసులు అదుపులో ఇద్ద‌రు మహిళ‌లు…!

ఇక మ‌రో మ‌రో కేసును న‌గ‌రంలోని టూటౌన్ పోలీసులు చేధించారు.  న‌గ‌రంలోని మూడు లాంత‌ర్ల నుంచీ నెల్లిమ‌ర్ల‌వైపు వెళుతున్న ఆ ఆటోలో తోటి   ప్ర‌యాణీకుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని  చైన్ స్నేచింగ్ మాదిరిగానే మాట‌ల‌లో పెట్టి  బ్యాగ్ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు మ‌హిళా దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నట్టు డీఎస్పీ అనిల్ తెలిపారు.

విజ‌య‌న‌గ‌రం,కొత్త వ‌ల‌స‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను ప‌ట్టుకుని వారి వద్ద నుంచీ 60 వేలు విలువ చేసే 3 తులాల బంగారాన్ని ప‌ట్టుకున్న‌ట్టు డీఎస్పీ తెలిపారు. ఈ మీడియా  స‌మావేశంలో సీసీఎస్ సీఐలు కాంతారావు, శ్రీనివాస‌రావు, భోగాపురం సీఐ శ్రీధ‌ర్,రూర‌ల్ సీఐ మంగ‌వేణి, పూస‌పాటిరేగ ఎస్ఐజ‌యంతి,భోగాపురం ఎస్ఐ మ‌హేష్ ,టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావులు పాల్గొన్నారు.

Related posts

(Professional) Diabetes Latest Drugs Reduce High Blood Sugar Fast Diabetes Meds Side Effects

Bhavani

ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

Bhavani

అశ్వ వాహన సేవలో సౌమ్యనాధ స్వామి…

Bhavani

Leave a Comment