38.2 C
Hyderabad
May 5, 2024 19: 59 PM
Slider ప్రకాశం

ముగ్గురికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి

#head constables

ప్రకాశం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ఖాళీల ఆధారంగా ముగ్గురు కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుల్ (HC)గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ, జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి ప్రమోషన్ పత్రాలను అందజేశారు. పదోన్నతులు పొందిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారితో మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి చాలా గర్వకారణమని, పదోన్నతి లభించడం విధి నిర్వహణలో బాధ్యతను మరింత పెంచుతుందని, పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెరిగే విధంగా బాధ్యతలు

నిర్వహిస్తూ ఉన్నతాధికారుల నుండి మన్ననలు అందుకోవాలని అన్నారు. ప్రజలు పోలీసులపై వుంచిన నమ్మకానికి తగ్గట్లుగా పనిచేయడంతో పాటు, భాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో శాఖాపరమైన సహకారం అందించడానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Related posts

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల పెంపునకు చర్యలు

Satyam NEWS

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి మరో సవాల్: ఈ సారి బీజేపీ రూపంలో…

Bhavani

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దుబ్బాకలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment