27.7 C
Hyderabad
April 26, 2024 06: 04 AM
Slider ముఖ్యంశాలు

కిలిమంజారో పర్వత అధిరోహణకు బానోతు వెన్నెల సిద్ధం

#Santhosh Kumar

జనవరి 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారా పర్వత అధిరోహణ చేయనున్న సందర్భంగా ఈరోజు ప్రగతి భవన్ లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని గిరిజన విద్యార్థిని బానోత్ వెన్నెల మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నది.

ఈ సందర్భంగా భానోతు వెన్నెల మాట్లాడుతూ మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేట గ్రామం అని గిరిజన కుటుంబం అని నాకు చిన్నతనం నుండి పర్వత అధిరోహణ చేయడం ఇష్టమని తెలిపింది. అందులో భాగంగా ఈనెల 19 నుండి దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో (5895) మీటర్ల పర్వతాన్ని అధిరోహించడం కోసం వెళ్ళటం జరుగుతుందని తెలిపారు.

భవిష్యత్తులో ప్రపంచంలోనే అతి పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ (8840) మీటర్ల పర్వతాన్ని కూడా అధిరోహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వెన్నెల ను అభినందిస్తూ నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వెన్నెల పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా తన వంతు సహాయంగా మూడు లక్షల(3,00,000)రుపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది.

భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని, తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ కుడా ఉన్నారు.

Related posts

కరోనా సెకండ్ వేవ్ పై అప్రమత్తం: ట్రాఫిక్ సిబ్బంది కి సోకడంతో అలెర్ట్

Satyam NEWS

ఏడు గంటల పాటు కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష…!

Satyam NEWS

బాబు విడుదలతో మిన్నంటిన సంబరాలు

Satyam NEWS

Leave a Comment