41.2 C
Hyderabad
May 4, 2024 18: 49 PM
Slider చిత్తూరు

పుత్తూరు లో టిట్కో ఇళ్లకు భూమిపూజ

#roja

పుత్తూరు మున్సిపాలిటీ వినాయకపురం లో టిట్కో హౌసింగ్ వైఎస్సార్ జగనన్న నగర్ లో  4.5 కోట్లతో చేపడుతున్న మౌలిక సదుపాయాలకు మంత్రి ఆర్.కె.రోజా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్.కె.రోజా మాట్లాడుతూ సుమారు 04.50 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను ఈరోజు ఈ టిట్కో ఇళ్ల కాలనీలో చేపడుతున్నామన్నారు. ఈ వసతులన్నింటినీ పూర్తి చేసి అతి త్వరలోనే లబ్ధిదారులు ఈ ఇళ్లలో నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటాం.

432 టిట్కో ఇళ్లను జీ ప్లస్ 3 విధానంలో నిర్మిస్తున్నాం…వీటిని మౌలిక వసతులు పూర్తయ్యాక లబ్దిదారులకు అందిస్తాం. ఇందులో కూడా 384 ఇళ్లను  ఏవైతే 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయో…వాటిని ఒక్క రూపాయికే మీకు రిజిస్ట్రేషన్ చేసి జగనన్న ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు. మిగిలిన 48 ఇళ్లు ఏవైతే..430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయో…వాటన్నింటినీ కేవలం 50 వేలకే లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.

జగనన్న పాదయాత్రలో పేదలకు మాటిచ్చిన ప్రకారం టిట్కో ఇళ్ల లబ్ధిదారులు 300 చదరపు అడుగుల ఇళ్లకు అర్హత సాధించారో వారందరికీ ఉచితంగా ఇళ్లను ఇస్తున్నారు. అన్నమాట ప్రకారం జగనన్న చేసి చూపిస్తున్నారు. ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో ప్రారంభమైనా, చంద్రబాబు నాయుడు పనులు పూర్తి చేయకుండా డబ్బులు వసూలు చేయడమే కాకుండా, పేదలను 20 ఏళ్లు, 30 ఏళ్లు రుణగ్రస్థులను చేయాలని చూశారని అన్నారు.

కానీ ఈరోజు జగనన్న 300 చదరపు అడుగుల ఇల్లు ఒక్క రూపాయికే ఇచ్చి పేదలను రుణ విముక్తి కలిగించిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఈరోజు జగనన్న పేదల సొంతిటి కలను తన కలగా భావించి నిజంచేస్తున్నారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 21 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక. రాష్ట్రంలోని 88 పట్టణాల్లోని 163 చోట్ల ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తిచేస్తోంది.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వంలో భారీగా నిర్మాణ వ్యయాన్ని పెంచేసి అవినీతికి పాల్పడితే…ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి సుమారు 392 కోట్లను ఆదా చేసింది. చంద్రబాబు హయాంలో బేస్ మెంట్ లెవల్ కూడా పూర్తి కాని ఇళ్లల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి 3232 కోట్లకు పాత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్ ని 2,840 కోట్లకు రివర్స్ టెండరింగ్ ద్వారా తగ్గించి 392 కోట్ల ను ఆదా చేసింది ఈ ప్రభుత్వం. టిట్కో ఇళ్లలోను మూడు కేటగిరీల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 2 లక్షల 62 వేల 216  ఇళ్లను నిర్మిస్తోందని మంత్రి తెలిపారు.

Related posts

ద కపిల్ శర్మ షో లో జాన్వీకపూర్

Bhavani

ఎనదర్ వాయిస్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్

Satyam NEWS

ఎంపి రఘురామకృష్ణంరాజుకు మంత్రి హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment