42.2 C
Hyderabad
May 3, 2024 18: 37 PM
Slider ప్రపంచం

ఎనదర్ వాయిస్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్

Ghani

పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూనే ఉందని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అన్నారు. టెర్రర్ ఫైనాన్సింగ్ పై పారిస్ లో జరుగుతున్న కీలకమైన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఏటీఎఫ్) మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నాన్సీ పెలోసీ అధ్యక్షతన జరుగుతున్న అమెరికన్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, 56 వ మ్యూనిచ్ భద్రతా సదస్సు లో ఘనీ మాట్లాడారు.

పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కు తోడు తాలిబాన్ ఇంకా మాదక ద్రవ్యాల రవాణాలో నిమగ్నమై ఉందని ఘనీ నొక్కి చెప్పారు. నార్కోటిక్స్, తీవ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ పోరాటం చేస్తూనే ఉందని ఆయన అన్నారు. గత రెండు దశాబ్దాలుగా కష్టపడి సంపాదించిన శాంతిని కాపాడుకోవడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. సుస్థిర, సమ్మిళిత శాంతి కోసం దార్శనికతతో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.

అమెరికన్ దళాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఉపసంహరించడం పై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇప్పటికే 94 శాతం మేరకు తమ దళాలు శాంతి పరిరక్షణలో ఉన్నాయని, మిగిలిన వాటిని అమెరికా ఉపసంహరించుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తమ భూభాగాన్ని ఉగ్రవాదుల నుంచి పరిరక్షించుకునే సామర్ధ్యం తమకు ఉందని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలపై కూడా ఆయన స్పీకర్ కు వివరించారు.

Related posts

కన్నుల పండువగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

Satyam NEWS

మహారాష్ట్ర లో ఎన్కౌంటర్: ఒక మావోయిస్ట్ మృతి

Satyam NEWS

న్యూ స్కీమ్: జగనన్న విద్యా వసతి కార్యక్రమం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment