32.2 C
Hyderabad
May 2, 2024 02: 12 AM
Slider ప్రత్యేకం

తిరుమల అడవుల్లో 30 చిరుతలు?

#tirumala

తిరుమల నడక మార్గంలో చిన్నారిని చంపేసిన చిరుత అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో సోమవారం చిక్కుకుందన్న ఆనందం శ్రీవారి భక్తులకు మిగలలేదు. తిరుమలలో ఉదయం ఒక చిరుత హల్చల్ చేసింది. అది చూసి భక్తులు పరుగులు తీశారు. శ్రీవారి మెట్లు 2000 వద్ద ఒక ఎలుకబంటి ప్రత్యక్షం అయ్యింది. దాన్ని చూసి భక్తులు హడలిపోయారు. మరి కొంత సమయానికి నడక దారిలో మరో అయిదు చిరుతలు కనిపించడంతో భక్తులు చిగురుటాకుల్లా వణికి పోయారు. ఈ విషయాల మిద అరా తీయగా అటవీ శాఖ అధికారులు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంకా 25 నుండి 30 చిరుతలు అడవిలో ఉన్నట్లు చెప్పారు.

వాటిని నియంత్రించడం తమ వాళ్ళ కాదని చేతులెత్తేశారు. ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేసుకోవాలని TTDని కోరారు. దీంతో TTD నడకదారి భక్తుల మిద అంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 తరువాత నడకదారిలో 15 సంవత్సరాల లోపు చిన్నారులకు ప్రవేశాన్ని నిషేధించింది. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గ పదవీ భాద్యతలు చేపట్టిన నాటి నుండి వరుసగా దుస్సంఘటనాలు జరుగుతున్నాయి.

గతంలో ఒక బాలుడి మిద చిరుత దాడి చేసినా, బాలుడు బతికిబయట పడ్డాడు. ప్రస్తుతం బాలిక మరణించడంతో శ్రీవారి భక్తుల విశ్వాసాలకు విఘాతం కలుగుతోంది. తన దర్శనానికి పవిత్రంగా కాలినడకన వస్తున్న భక్తులు చిరుత బారిన పడటం జీర్ణించుకోలేక పోతున్నారు. బాగావంతుని మీదనే నమ్మకం సడలే ప్రమాదం ఉంది. దానికి తోడు ఎలుకబంటి కనిపించడం, తిరుమలలో చిరుత హల్చల్ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఇంకా 30 వరకు చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ ద్రూవీకరించడంతో భక్తులు తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి కొండకు వచ్చే పరిస్థితి ఉండదు. నేరస్తులు, హంతకులు, అన్య మతస్తులు, దేవుడి మిద నమ్మకం లేనివారు, గతంలో స్వామిని తులనాడిన వారు పాలకులు కావడంతోనే దుష్ట శకునాలు కనిపిస్తున్నాయని శ్రీవారి భక్తులు అందోళన చెందుతున్నారు. చిన్నారి మృతదేహం దొరికిన ప్రాంతంలోనే సోమవారం చిరుత బోనుకు చిక్కింది.

తిరుమలలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చంపేసిన చిరుత బోనుకు చిక్కింది. రెండ్రోజుల క్రితం మెట్ల మార్గంలో కాలినడకన వెళుతున్న చిన్నారిని చిరుత లాక్కుపోయింది. నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలెంకు చెందిన దినేష్ శశికళ దంపతులు శుక్రవారం తిరుపతి వచ్చారు. కాలి నడకన మెట్ల మార్గంలో తిరుమల వెళ్లేందుకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నడక ప్రారంభించారు.

సాయంత్రం ఆరున్నర ఏడు గంటల సమయంలో 7వ మలుపు తర్వాత చిన్నారి లక్షిత కనిపించకుండా పోయింది. దీంతో స్థానికంగా బంధువులు వెదుకులాడినా ఫలితం లేకపోవడంతో పోలీసుల్ని రాత్రి పది గంటల సమయంలో ఆశ్రయించారు. శనివారం ఉదయం మెట్ల మార్గానికి సమీపంలోని గుట్టపై చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ నాలుగు బోన్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయానికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

తిరుమలలో వన్యప్రాణులు కొద్దిరోజులుగా కలకలం సృష్టిస్తున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. నడకదారిలో జంతువుల సంచారం ఎక్కువైపోతుండటంతో ఎక్కడ దాడి చేస్తాయోనని శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజులుగా తరచుగా భక్తులకు ఏదోక జంతువు కనిపిస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. నిన్న కూడా మెట్ల మార్గంలో ఒక చిరుత కలకలం రేపగా.. ఇవాళ శ్రీవారి మెట్టు మార్గంలో ఎలుగుబంటి కనిపించింది.

నడక మార్గం దగ్గరకు చిరుతలు రావడానికి కారణాలు అన్వేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 500పైగా ట్రాప్ కెమెరాలు అమర్చి, అడవిలో ఏమి జరుగుతుందో నిరంతర పర్యవేక్షించేలా వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వన్య ప్రాణి దాడులు జరిగిన వెంటనే అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ అధికారులు చెప్పారు. టీటీడీ సహకారాన్ని వినియోగించుకుని ఏర్పాట్లు చేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

నడకదారిలో రోజూ జంతు సంచారం కనిపిస్తుండటంతో టీటీడీ అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. నడకమార్గం సమీపంలోనే మరో 5 చిరుతలు సంచరిస్తున్నట్లు ట్రూప్ కెమెరాల్లో గుర్తించామని, వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. శేషాచలం అడవుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, పట్టుబడ్డ చిరుతలను ఎస్వీ జూపార్క్‌కు తరలించనున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం పట్టుబడ్డ ఆడ చిరుతకు నాలుగేళ్లు అని, బాలికపై దాడి చేసిన చిరుత ఇదేనా..? కాదా..? అనేది పరిశీలిస్తామన్నారు.

నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు చిన్నారులకు నేటి నుంచి అనుమతి నిరాకరిస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్‌రోడ్‌లో బైక్‌లకు అనుమతి లేదని తెలిపారు. అయితే లాక్‌డౌన్ సమయంలో ఆలయ పరిసరాలకు వన్యప్రాణులు అలవాటుపడ్డాయి. దీంతో తరచూ నడకమార్గాలు, ఘాట్ రోడ్డులలో కనిపిస్తున్నాయి.

వన్యప్రాణులను గుర్తించి ట్రాప్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. నడకమార్గంలో సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, బంధించిన మృగాలను జూపార్క‌కు తరలించడం లేదా సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 25-30 చిరుతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఎలుగుబంటి కనిపించటం కలకలంగా మారింది. దీంతో, కాలినడకన మార్గంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. లక్షిత వ్యవహారంతో టీటీడీ కాలినడక మార్గంలో పలు ఆంక్షలు విధించింది.

కాలిబాట అటవీ మార్గంలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో త్వరలోనే అధ్యాయనం చేస్తామన్నారు. నడక మార్గానికి సమీపంలోని కిలో మీటర్ పరిధిలో 500 కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్ని చిరుతలు సంచారిస్తున్నాయో గుర్తిస్తామన్నారు. 7వ మైల్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే మానిటరింగ్ సెల్‌ని ఏర్పాటు చేస్తున్నారు. కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత ఈ ఆపరేన్ కొనసాగిస్తున్న సమయంలో ఈ ఉదయం నడక మార్గంలో 2000 మెట్టు వద్ద ఎలుగుబంటి కనిపించింది.

దీంతో, భక్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది అలర్ట్ అయి ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేసారు. కొద్ది రోజుల క్రితం మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం సీసీ కెమేరాలో కనిపించింది. తిరుమలకొండ నామాలగవి ప్రాంతంలో మరో చిరుత సంచరించిందనే ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. చిరుతలు ఉదయం సమయంలో బయటకు రావని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నడకదారుల్లో పిల్లల అనుమతిపై పలు ఆంక్షలు విధించింది. 15 ఏళ్లలోపు పిల్లలు గల తల్లిదండ్రులను ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో అనుమతించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.

మరోవైపు తిరుమల భద్రతా ఏర్పాట్లపై నేడు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో 15 ఏళ్లలోపు పిల్లల్ని మెట్ల మార్గంలో పంపకూడదని నిర్ణయించారు. తిరుమల ఏడో మలుపు వద్ద పిల్లలకు ట్యాగ్‌లు వేయడాన్ని ఆదివారం ప్రారంభించారు. తిరుమల నడక మార్గంలో పలు ప్రాంతాల్లో చిరుతల కదలికల్ని అటవీ శాఖ గుర్తించింది. అలిపిరి మార్గంలో రాత్రి పదిగంటల వరకు మెట్ల మార్గంలో సాయంత్ర ఆరుగంటల వరకు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారు. రెండు మార్గాల్లో 15 ఏళ్లలోపు చిన్నారుల్ని మధ్యాహ్నం రెండు గంటల లోపు మాత్రమే కాలి నడకన అనుమతించనున్నారు.

చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చిరుత కదలికల్ని అధికారులు గుర్తించారు. తిరుమల నడక మార్గంలో రెండు మూడు ప్రదేశాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు గుర్తించినట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అవి వేర్వేరు చిరుతలా ఒకటేనా అనేది గుర్తించాల్సి ఉందన్నారు. మెట్ల మార్గంలో తిరుగుతున్న వాటన్నింటిని పట్టుకుని ఇతర ప్రాంతాల్లో సురక్షితంగా వదిలిపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. వన్యప్రాణుల విషయంలో అటవీ శాఖ కోరిన ఎలాంటి సహకారమైనా అందిస్తామన్నారు. అటవీ శాఖ భరోసా ఇచ్చే వరకు చిన్న పిల్లల్ని నడక దారుల్లో అనుమతించమని చెప్పారు. నడక దారుల్లో దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడంపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తున్నామని వీటిపై చర్చించాల్సి ఉందన్నారు.

లక్షితపై దాడి చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో ఇవాళ ఉదయం ఒక చిరుత పట్టుబడింది. ఆదివారం 2450 మెట్టు వద్ద మరో చిరుత కనిపించింది. దీంతో అదే ప్రాంతంలో మరిన్ని బోనులతో పాటు వృక్షాలకు కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం మెట్ల మార్గంలో మరో చిరుత కనిపించినట్లు ప్రచారం జరగ్గా.. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కనిపించింది చిరుత కాదని, జింక అని తేల్చారు. చిరుత అని భక్తులు అనుమానపడ్డట్లు చెప్పారు. అటు తిరుమలలో చిరుత దాడిపై అటవీశాఖ ఉన్నతాధికారుల నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల కాలినడక మార్గంలో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు 100 మీటర్ల వ్యవధిలో క్యాప్చర్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వన్య మృగాల కదలికల ఆధారంగా భక్తులను అనుమతించాలని భావిస్తున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

Satyam NEWS

స్వర్ణ ప్రాజెక్ట్‌ను సంద‌ర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

మన ఊరు మనబడి పనులను వేగంగా చేయాలి

Murali Krishna

Leave a Comment