37.2 C
Hyderabad
May 6, 2024 11: 28 AM
Slider ఆధ్యాత్మికం

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుని అలంకారంలో శ్రీ‌ మలయప్ప

#simhavahanam

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుని అలంకారంలో దర్శనమిచ్చారు.

సింహ వాహనం – ధైర్య‌సిద్ధి

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

Related posts

స్వామియే శరణం అయ్యప్ప: కరిమలై వాసుని కటాక్షం కోసం

Satyam NEWS

[Official] How To Higher Cholesterol Ace Inhibitor Blood Pressure Pills Amazon Prime Blood Pressure Supplements

Bhavani

జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేత‌నం రూ. 3 వేలు పెంపు

Sub Editor

Leave a Comment