25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ జొన్నలగడ్డ వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిని పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదలకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.