Slider కరీంనగర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు

kamalasan reddy

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కరీంనగర్‌ కమీషనరేట్‌ పోలీసులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు నియమనిబంధనల పై అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, వివిధ రకాల వాహనదారులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు.

పోలీస్‌ శాఖ ఈ సంవత్సరాన్ని రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యతనిచ్చిన విషయం విదితమే. కరీంనగర్ పోలీసు కమిషనర్ వి బి కమలాసన్ రెడ్డి పూర్తి బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిర్వహించతలపెట్టిన ఈ అవగాహన కార్యక్రమాలకు కళాబృందాలను వినియోగిస్తూ పాటలు, నృత్యాలు, నాటికల ద్వారా ప్రదర్శనలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత కమిటిలో ఉన్న ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటం ప్రమాదాలకు కారణం అవుతున్నదని పేర్కొనవచ్చు. హెచ్‌కెఆర్‌, ఎన్‌ హెచ్‌ రోడ్డతో పాటు ఇంటర్నల్‌ రోడ్ల పై జరుగుతున్న ప్రమాదాల తీరును అధ్యయనం చేసి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ అవగాహన కార్యక్రమాల సందర్భంగా హెల్మెట్‌ వినియోగం, రాంగ్‌రూట్‌ డైవింగ్‌, డ్రంక్‌అండ్‌ డైవ్‌, మైనర్ల డైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌లతో మాట్లాడుతూ డైవింగ్‌ చేయడం, నిర్లక్ష్యం, అతివేగం, లైసెన్సులు లేకుండా నడుపడం, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని నడుపుతున్న వివిధ రకాల వాహనాలు, సీట్‌బెల్ట్‌ ధరించడం, వాహనాలకు ఇన్సూరెన్స్‌ చేయించడం, వాహనాలు కొనుగోలు, విక్రయాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. కమీషనరేట్‌ వ్యాప్తంగా ఈ సంవత్సరం ఈనెల 15వరకు 506 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

Related posts

తెలంగాణలో టిడిపిని బతికిద్దాం రండి

Satyam NEWS

కామారెడ్డి లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రారంభించిన కలెక్టర్

Satyam NEWS

దిశ పీఎస్ లో లేడీ పోలీసు బాస్…ఆకస్మిక తనిఖీలు…!

Satyam NEWS

Leave a Comment