28.7 C
Hyderabad
May 6, 2024 10: 48 AM
Slider విజయనగరం

తప్పిన ప్రమాదం.. స్టేషన్ కు చేరిన యవ్వారం….!

#traffic

“సత్యం న్యూస్. నెట్” కెమెరా కు చిక్కిన గందరగోళం..!

విజయనగరం జిల్లా లో కార్పొరేషన్ గా ఎదిగిన జిల్లా కేంద్ర మైన విజయనగరం లో పెరిగిన  ట్రాఫిక్ తో అటు వాహన చోదకులు అదే వాహనాలు నడిపే వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ,ఇన్నీ కావు.దీనికి తోడు ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించే పనిలో ట్రాఫిక్ సిబ్బంది అలెర్ట్ గా ఉంటున్నారు. కానీ… విజయనగరం లో ఈ సాయంత్రం అంటే ఏడవ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ సమీపంలో చిటికెలో ఘోర ప్రమాదం తప్పింది… పర్యవసనంగా…అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది గోపాల్ రావు పుణ్యమా…యవ్వారం కాస్త వన్ టౌన్ స్టేషన్ కు చేరింది.

అసలు జరిగిందేంటే..ఆర్టీసీ కాంప్లెక్స్ బస్టాండ్ నుంచీ పార్వతీ పురం వెళుతున్న ఆర్టీసీ బస్సు.. మయూరీ జంక్షన్ వైపు వస్తుండగా…అదే సమయంలో బాలాజీ జంక్షన్ నుంచీ ఓ కారు మయూరీ జంక్షన్ వైపు వెళుతున్న సమయంలో.. ఐనాక్స్ వద్ద రెండు ఢీ కొన్నాయి.ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతింది.అదే సమయంలో గమ్యస్థానానికి వెళ్లాల్సి ఉండటంతో సదరు ఆర్టీసీ డ్రైవర్.. పట్టించుకోకుండా…ప్రయాణీకులతౌ ఆర్టీసీ బస్సు ను తీసుకెళ్లేందుకు యత్నించిన సమయంలో… సదరు కారు నడుపుతున్న వ్యక్తి… డ్యామేజ్ అయ్యింది… ఎవరు బాధ్యులో తేలాలని..కోరడంతో మిగిలిన బైక్ చోదకులు కూడా… ఆర్టిస్ట్ బస్సు డ్రైవర్ నే ప్రశ్నించారు.

దీంతో కాంప్లెక్స్ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొద్ది సేపైన తర్వాత ట్రాఫిక్ జామ్ ఎందుకైందో..నని అక్కడే ఉన్న ట్రాఫిక్ సిబ్బంది గోపాలరావు… హుటాహుటిన సంఘటనా స్థలికి వచ్చి… ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు యత్నించాడు… నా కారు డ్యామేజ్ కు పరిష్కారం కావాలని పట్టుబట్టడంతో… మరోవైపు ప్రధాన జంక్షన్ అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహనాలతో జామ్ కావడంతో… ఇరు వాహనాల సిబ్బంది వన్ టౌన్ వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని…వాహనాలను తీసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాని చెప్పడంతో  ఆర్టీసీ, కారు ప్రమాదపు వ్యవహారం కాస్త వన్ టౌన్ స్టేషన్ కు చేరింది. మరి వన్ టౌన్ పోలీసులు ఏ విధంగా సమస్య ను పరిష్కరిస్తారో నని “సత్యం న్యూస్. నెట్.” అంటోంది.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పతి పాలన విధించాలి

Satyam NEWS

సర్వే నిజం:మున్సిపాలిటీపై తెరాస జెండా చైర్మన్ గా కొండ శ్రీలత

Satyam NEWS

కాశ్మీర్ లో నిర్భంధాలపై కేంద్రానికి సుప్రీం అక్షింతలు

Satyam NEWS

Leave a Comment