38.2 C
Hyderabad
April 29, 2024 22: 23 PM
Slider విజయనగరం

వారం రోజుల్లో సమస్యలు పరిష్కారం కావాలి

spandana

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయనగరం పోలీసు బాస్ “స్పందన”.

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక “స్పందన” కార్యక్రమాన్ని  నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 26 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

విజయనగరం కు చెందిన ఒకరు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేస్తూ తన ఇంటికి దగ్గరలో ఉన్న వ్యక్తులు తాము నూతనంగా ఇంటిని నిర్మించాలని భావించి, సదరు ఇంటిని పడగొట్టే సమయంలో తన ఇంటి ఇంటి షేడ్ మరియు గోడను పూర్తిగా పడిపోయినట్లు, సదరు విషయమై వారితో మాట్లాడగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి, ఎటువంటి పరిష్కారం చూపలేదని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని 1వ పట్టణ ఎస్ఐను ఆదేశించారు.

గంట్యాడ మండలం నందాం కి చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి, తన వద్ద నుండి 20 వేలు తీసుకున్నట్లు, కానీ ఇంత వరకు డబ్బులను తిరిగి చెల్లించడం కాని, ఉద్యోగం కల్పించడం కాని చేయలేదని, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేసి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గంట్యాడ ఎస్ఐను ఆదేశించారు.

విజయనగరం  కి చెందిన ఒకామె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమకు గజపతినగరం మండలం మలి  లో 0.17 సెంట్లు వ్యవసాయ భూమి కలదని, సదరు భూమిని విశాఖపట్నంకు చెందిన కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకొని, వ్యవసాయం చేస్తున్నట్లు, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని గజపతినగరం సిఐను ఆదేశించారు.

విజయనగరంకు చెందిన ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను జమ్ము నారాయణపురం గ్రామంలో సర్వే నంబరు 90/5లో 0.36 సెంట్లు భూమిని కొనుగోలు చేసినట్లు, సదరు అమ్మిన వ్యక్తి బంధవులు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, సదరు భూమిని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని విజయనగరం రూరల్ ఎస్ఐను ఆదేశించారు.

చీపురుపల్లి మండలం పుర్రేయవలస  కి చెందిన ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తమకు గ్రామంలోగల వ్యవసాయ భూమికి గల హద్దులను అదే గ్రామానికి చెందిన వ్యక్తి పాడు చేసి, కొంత భూమిని ఆక్రమించుకున్నట్లు, ఈ విషయమై వారిని ప్రశ్నించగా, తమపై దౌర్జన్యంకు పాల్పడుతున్నట్లు, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని చీపురుపల్లి సిఐను ఆదేశించారు.

విజయనగరం కు చెందిన ఒక వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను ఆర్క్ సెక్యూరిటీ సర్వీసు నందు సెక్యూరిటీ గార్డుగా గత రెండు ఏళ్లుగా పని చేసానని సదరు సెక్యూరిటీ ఏజన్సీ వారు తనకు రెండున్నర మాసాల జీతంను చెల్లించడం లేదని, ఈ విషయమై వారిని ఎన్నిసార్లు ప్రశ్నించినా, నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదికి న్యాయం చేయాలని బొండపల్లి ఎస్ఐను ఆదేశించారు.

ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బి సిఐ జె. మురళి, ఎస్బీ సిఐలు రుద్రశేఖర్, జి.రాంబాబు, ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

సీతారామ పనుల్లో వేగం పెంచాలి

Bhavani

కోర్టుకు చేరిన కర్నాటక మహిళా బ్యూరోక్రాట్ల కేసు

Satyam NEWS

బంగారం కోసం ఘాతుకం…! బంధువే హంతకుడు…!

Satyam NEWS

Leave a Comment