31.2 C
Hyderabad
May 3, 2024 01: 56 AM
Slider నిజామాబాద్

సామాజిక వ్యవస్థ పై అలుపెరుగని పోరాటం చేసిన భాగ్యరెడ్డి వర్మ

సామాజిక వివక్షత పై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానం లో 26 దళిత బాలికల పాఠశాలను స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. దళితుల అభ్యున్నతికి పాటు పడ్డారని చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందు దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని పేర్కొన్నారు.

సామాజిక వివక్షతలు, అసమానతలు, మూఢనమ్మకాలపై పోరాటం చేశారని తెలిపారు. జోగిని వ్యవస్థను రూపుమాపడానికి పోరాటం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రజిత, హాస్టల్ వార్డెన్ లు నాగరాజు.ప్రవీణ్ అధికారులు పాల్గొన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

మీసం తిప్పడం, విజిల్ వేయడం సభా సంప్రదాయమా…?

Satyam NEWS

కాగజ్ నగర్ కిమ్స్ లో హార్మోన్ ఎన్ లైజర్ ప్రారంభం

Satyam NEWS

(Free|Sample) Natural Treatment For High Blood Sugar Byetta Diabetes Medicines

Bhavani

Leave a Comment