28.7 C
Hyderabad
May 5, 2024 08: 48 AM
Slider నల్గొండ

జయప్రకాష్ రెడ్డికి కళాకారుల ఘన నివాళులు

#JayaprakashReddy

ప్రముఖ రంగస్థల, చలనచిత్ర నటుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అకాల మరణంతో ఇటు నాటక సమాజానికి అటు చలనచిత్ర రంగానికి తీరని లోటు ఏర్పడిందని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ లో జరిగిన సమావేశంలో కళాకారులు అన్నారు.

జయప్రకాశ్ రెడ్డికి వారు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం వారు మాట్లాడుతూ జయప్రకాష్ రెడ్డి తన జీవన ప్రయాణంలో ఎన్నో మరెన్నో అవార్డులు అందుకున్నారని, నాటక రంగానికి విశేషమైన కృషిచేసి సినీ రంగంలో ప్రవేశించి ప్రఖ్యాత నటుడిగా, రచయితగా గుర్తింపు పొందారు అన్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల యొక్క మన్ననలను పొందారని, ఏ పాత్ర పోషించిన ఆ ప్రాంత భాష, యాసను పునికి పుచ్చుకొని తన నటన ద్వారా ప్రేక్షకులను ఆనందింప చేశారని,అటువంటి మహనీయుడు లేకపోవటం నాటక రంగానికి, చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆ మహనీయుని ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళారంగ జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, స్పందన నాట్య కళామండలి కొట్టు బాబు, చింతకాయల రాంబాబు, వంశీకృష్ణ, భద్రాచలం, రాంబాబు, కంబాల నాగమణి, యరగాని మంగమ్మ, అలవాల రవి, విజయ్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డూప్లికేట్ ప్యారాచూట్ ఆయిల్ రెడ్ లేబుల్ టీ పౌడర్ స్వాధీనం

Satyam NEWS

రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. త‌ప్పిన ముప్పు!

Sub Editor

అత్యంత సంపన్నురాలు ఐశ్వర్యరాయ్ పుట్టిన రోజు నేడు

Bhavani

Leave a Comment