40.2 C
Hyderabad
May 5, 2024 18: 44 PM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి అక్రమ వెంచర్ల పై ఆర్ డి ఓ కు వినతి పత్రం

##IllegalLayouts

కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వెంచర్లు నిర్వహించి పేద ప్రజలను మోసం చేస్తున్నారని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ కు మంగళవారం ఎమ్మార్పీ పి ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా   ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మబ్బు సాయన్న మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని కుర్మిద్ద గ్రామ శివారు సర్వే నెంబర్ 25 27 లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు చేసి  ప్లాట్లుగా విక్రయిస్తున్నారని పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండా అటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాక పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని అట్టి వారి పై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అదేవిధంగా అక్రమంగా వెలుస్తున్న వెంచర్ లను వెంటనే తొలగించాలని, ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు తెలియని సామాన్యులు వారిని వారికి న్యాయం చేయాలని  ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లెల రాములు ఎమ్మార్పీఎస్ కల్వకుర్తి మండల అధ్యక్షుడు ముప్పిడి కృష్ణ ,పట్టణ అధ్యక్షుడు నేరడి చిన్న, తాలూకా యువసేన అధ్యక్షుడు శేఖర్, నాయకులు లాల్ జంగయ్య, నాని, పరుశరాములు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

పొలిటికల్ వీడియో: గుండెలు పిండేసి మోడీని ఎండేసి

Satyam NEWS

కృతిశెట్టికి బంపర్ ఆఫర్

Bhavani

Leave a Comment