29.7 C
Hyderabad
May 6, 2024 04: 23 AM
Slider ముఖ్యంశాలు

సర్దార్ పటేల్ విగ్రహానికి పాలాభిషేకం

#sardarpatel

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఎన్.ఎస్.యు.ఐ. భారత దేశ ప్రథమ కేంద్ర హోమ్ శాఖా మాత్యులు స్వర్గీయ సర్దార్ వల్లబభాయ్ పటేల్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో ద్వారా నిజాం నిరంకుశ పాలనను అంతమొందించి ఆనాటి హైదరబాద్ రాష్ట్రమైన నేటి తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారత దేశ ప్రథమ కేంద్ర హోమ్ శాఖా మాత్యులు స్వర్గీయ సర్దార్ వల్లబభాయ్ పటేల్ విగ్రహానికి ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూరి ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ. బృందం పాలాభిషేకం చేసిన అనంతరం వారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ కండువాతో సత్కరించి, వారి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను పెట్టారు.

ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రాన్ని అందించిన ఘనత భారత దేశ ప్రథమ కేంద్ర హోమ్ శాఖా మాత్యులు స్వర్గీయ సర్దార్ వల్లబభాయ్ పటేల్ దని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేకుండా కేవలం బ్రిటిషర్ల తొత్తులుగా మాత్రమే వ్యవహారించిన ఆర్ఎస్ఎస్-బీజేపీ నాయకుల నీచ రాజకీయంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైన సర్దార్ వల్లబభాయ్ పటేల్ గారిని తమ పార్టీ నాయకుడిగా బీజేపీ పార్టీ చూపెట్టే ప్రయత్నం చెయ్యడం హాస్యాస్పదమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చందనా రెడ్డి, హైదరబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజీత్ యాదవ్, రంగా రెడ్డి జిల్లా ఎన్.ఎస్.యు.ఐ. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్.ఎస్.యు.ఐ. జాతీయ కో ఆర్డినేటర్ అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీకర్, బోయిడి నాగేంద్ర, అభినయ్ గౌడ్, రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

తల్లి పాలు బిడ్డకు అమృతం తుల్యం: డాక్టర్ వనజ

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

భవన నిర్మాణ కార్మికులు చనిపోయారా? ఎక్కడ?

Satyam NEWS

Leave a Comment