28.7 C
Hyderabad
May 5, 2024 09: 10 AM
Slider వరంగల్

లేబర్ ఆఫీసర్ ను హత్య చేసిన టీఆర్ఎస్ నాయకుడు

Murder by TRS leader

ఆర్ధిక లావాదేవీల కారణంగా ఒక అధికారిని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు దారుణంగా హత్య చేశారు. గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మోపు ఆనంద్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవిలో హత్యకు గురి అయి ఉండటాన్ని గమనించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

హత్య జరిగి మూడు రోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. హన్మకొండలోని అశోకా కాలనీలో నివాసం ఉంటున్న ఆనంద్ రెడ్డి గ్రూప్-2 అధికారి. ఆనంద్ రెడ్డి స్వగ్రామం జనగామ జిల్లా ఓబుల్ కేషవాపురం. ఈనెల 7వ తేదీన తన స్నేహితుడు ప్రదీప్ రెడ్డితో కలిసి ఆనంద్ రెడ్డి వెళ్లాడు.

ఆ నాటి నుంచి ఆయన ఆచూకీ తెలియలేదు. తాజాగా ఆనంద్ రెడ్డి శవం కనిపించింది. అదృశ్యమై నాలుగు రోజులు గడుస్తున్నా లభించకపోవడం, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు అనుకున్నట్లుగానే ఆనంద్ రెడ్డి శవమై కనిపించాడు.

ఆనంద్ రెడ్డి మిస్సింగ్ పై హన్మకొండ పోలీసులకు ఆయన కుటుంబ సభ్యలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. మృతదేహం కనిపించడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. రాంపూర్ శివారు అడవి ప్రాంతంలో ఆనంద్ రెడ్డి మృతదేహం గుర్తించగానే పోలీసులు అక్కడకు క్లూస్ టీం ను తీసుకువెళ్లారు.

పూర్తిగా కుళ్ళిపోయి, దుర్వాసన రావడంతో ఏం చేయలేక క్లూస్ టీం వెనుదిరిగింది. రేపు ఉదయం పోస్టుమార్టం టీంతో కలిసి మళ్లీ క్లూస్ టీం వెళుతుంది. సంఘటన స్థలంలోనే శవ పంచనామా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఈ హత్యలో మొత్తం నిందితులు ఆరుగురు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోళ్లబుద్ధరం అడవిలో హత్య చేసినట్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ రెడ్డి నేరం అంగీకరించాడు. ప్రస్తుతం ప్రదీప్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ప్రదీప్ రెడ్డి స్వస్థలం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామం. నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. మృతదేహాన్ని గుర్తించడానికి నిందితుడు శివ ను అక్కడికి పోలీసులు తీసుకెళ్లి చూపించారు. హత్య సమయంలో ఘటన స్థలంలో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Related posts

“ఐశ్వర్యకు తోడుగా అభిరామ్”తో యష్ రాజ్ అరంగేట్రం

Satyam NEWS

రామయ్య కోనేరు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు

Satyam NEWS

సోమశిల హైస్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

Satyam NEWS

Leave a Comment