33.2 C
Hyderabad
May 15, 2024 12: 42 PM
Slider ఆదిలాబాద్

అధికార పార్టీ ప్రతినిధి ధర్నా: అగ్గి పుట్టించిన ఇసుక అక్రమ దందా

#penchikalpet

ఇసుక నుంచి అగ్గి పుడుతుందా? మామూలుగా అయితే అగ్గి పుట్టదు. కానీ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలంలో మాత్రం ఇసుక నుంచి అగ్గిపుడుతున్నది. ఇసుక అక్రమ రవాణాపై ఎవరూ మాట్లాడటం లేదు కానీ అక్రమ రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్ ను అధికారులు సీజ్ చేస్తే మాత్రం ధర్నాలు జరుగుతున్నాయి.

అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అక్రమ రవాణాదారులను శిక్షిస్తే తమకు అభ్యంతరం లేదని ట్రాక్టర్ ఓనర్లు అంటున్నారు. ఈ మొత్తం కథలో ట్విస్టు ఏమిటంటే అధికార పార్టీకి చెందిన జెడ్పిటీసీ అధికారి పక్షపాత వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. ఇసుక అక్రమ రవాణా ఈ ప్రాంతంలో సర్వ సాధారణంగా జరిగే వ్యవహారమే. రోజుకు వందలాది ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో ఇసుకను తరలిస్తుంటారు.

అయితే ఎంఆర్ఓ అనంతరాజ్ నేడు ఒక ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ముందుగా డిడి కట్టిన తర్వాత ఇసుక రవాణా చేసుకోవాలని తాను చాలా సార్లు చెప్పానని, ముందుగానే హెచ్చరించి మరీ అక్రమ ఇసుకదారులపై దాడి చేసి పట్టుకున్నామని ఆయన సత్యంన్యూస్ కు తెలిపారు. అయితే ఈ విషయంపై ధర్నా చేసిన జెడ్పీటీసీ సముద్రాల సరిత, ఆమె అనుచరులు మాట్లాడుతూ ఇసుక రవాణా చేసుకోవడానికి ఒక ఏజెంటు ఉంటాడని, అతడితో బేరం మాట్లాడుకుంటే ఒక్క డిడిపై ఎన్ని ట్రిప్పులైనా ఇసుక అక్రమంగా తరలించేందుకు అనుమతిస్తున్నారని అన్నారు.

ఒక గిరిజనుడు కొత్తగా ట్రాక్టర్ కొనుక్కొని ఇసుక తోలేందుకు రావడంతో ఎమ్మార్వో ట్రాక్టర్ ను సీజ్ చేశాడని అంటున్నారు. ట్రాక్టర్ కొనుక్కొన్న గిరిజనుడు అధికారులు నియమించిన ఏజెంటును కలిసి మాట్లాడుకోలేదని, అతడికి ఇవ్వాల్సిన ముడుపులు ఇవ్వలేదని అందుకోసమే ట్రాక్టర్ ను సీజ్ చేశారని అంటున్నారు.

ఆ ఏజెంటు ద్వారా అధికారులు ముడుపులు తీసుకుంటున్నారని వారు తెలిపారు. రోజూ రాత్రీ పగలు ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు ఎవరిని పట్టుకోవడం లేదని వారు అన్నారు. ముందుగా సమాచారం అందించి తమకు కావాల్సిన వారిని పంపించి తమను పట్టుకున్నారని ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్ పి టిసీనే అధికారులకు వ్యతిరేకంగా ధర్నా చేయడం ఇక్కడ చర్చనీయాంశం అయింది.

Related posts

క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటున్న మహిళ

Bhavani

పవన్‌కు వాలంటీర్ల సెగలు: రాష్ట్రవ్యాప్తంగా దిష్టి బొమ్మలు దగ్ధం

Satyam NEWS

పేదల గుండెల్లో వైఎస్సార్ పదిలం

Satyam NEWS

Leave a Comment