18.7 C
Hyderabad
January 23, 2025 03: 58 AM
Slider ఆంధ్రప్రదేశ్

లీవ్ మీ: విచారణకు సహకరించని పృథ్వీతో మాట్లాడిన మహిళ

pridhvi 121

పరువు పోయింది ,ఇప్పటికే చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను దయచేసి నన్ను వదిలేయండి అంటూ విజిలెన్స్ అధికారులను వేడుకుంది బాధితురాలైన ఆ మహిళా. తనకు ఉద్యోగం పేర్మినెంట్ అవుతుందనే ఆశ తోనే పృథ్వీరాజ్ తో మాట్లాడి ఉంటుందని దీనిని అలుసుగా తీసుకొని అయన ఆమెతో అడ్వాన్స్ అయ్యాడని ధ్రువీకరించారు అధికారులు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న పృథ్వీరాజ్ ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చిన ఆడియో టేప్ ల విషయములో కేసు సరికొత్త మలుపు తీసుకుంది.

పృథ్వీతో సరస సంభాషణలు కొనసాగించిన మహిళా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి విముఖత చూపడంతో టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ ముందుకు సాగడంలేదని తెలుస్తోంది. తనతో పృథ్వీ ఫోన్లో మాట్లాడాడని చెబుతోన్న మహిళ ను విచారించా దానికి వెళ్లిన మహిళా తాను ఇప్పటికే అల్లరిపాలై కష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఆమె మీడియా ముందుకు రావడానికి ససేమిరా ఇష్టపడటంలేదు. దీంతో విజిలెన్స్ అధికారులు తమ వద్ద నున్న టెలీఫోన్ సంభాషణ టేపులతోనే విచారణ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బాధితురాలు ముందుకు రాకుంటే ఆరోపణలు నిరూపించడం, నిందితుడిపై చర్యలు చేపట్టడం సాధ్యంకాదని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎస్వీబీసీకి ఛైర్మన్ గా ఉన్న పృథ్వీరాజ్ ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై టీటీసీ చైర్మన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించగా పృథ్వీరాజ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Related posts

ప్రిపరేషన్: ఇబ్బందులు రాకుండా ఎన్నికల నిర్వహణ

Satyam NEWS

Tragedy: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఘోరం

Satyam NEWS

తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా

Satyam NEWS

Leave a Comment