30.3 C
Hyderabad
March 15, 2025 10: 37 AM
Slider సినిమా

స్పెషల్ ఆఫర్: వస్తవా వరంగల్లుకు అన్నీ ఇస్తా

warangal

సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ కార్యక్రమం జేఎన్ఎస్ స్టేడియంలో శుక్రవారం ఘనంగా జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సూపర్ స్టార్ మహేష్ బాబు, సినీ ప్రముఖులు విజయశాంతి, దిల్ రాజు, రశ్మిక మందన్న, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, దేవిశ్రీప్రసాద్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినాయభాస్కర్, పోలీస్ కమిషనర్ వి.రవీందర్ తదితరులు ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ సినిమా వాళ్లు ఇక నుంచి హైదరాబాద్ తరువాత వరంగల్ అడ్డాగా ఎంచుకోవాలని అన్నారు. సినీ పరిశ్రమ వరంగల్ కి వస్తాను అంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తానని మంత్రి అన్నారు. మాకు దిల్ రాజు, వంశీ పైడిపెల్లి ఉన్నారు. వారి సహకారంతో సినిమా ఇండస్ట్రీని వరంగల్ కి తీసుకవస్తారని ఆశిస్తున్నా అని మంత్రి అన్నారు.

దర్శకులు అనిల్ రావిపూడి ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా వరంగల్ కేంద్రంగా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఒక్క రోజే ముందుగా చెప్పినా జిల్లా కలెక్టర్, సీపీ చేసిన ఏర్పాట్లను మీరు చూసారు. ఇక ముందు కూడా ఇలానే ఉంటుంది అంటూ మంత్రి ఎర్రబెల్లి ఫుల్ ఆఫర్ ఇచ్చారు.

Related posts

సైబర్ నేరాల అవగాహన కోసం 27న ఫోన్ ఇన్

Murali Krishna

ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం పోలీసు బాస్..

Satyam NEWS

భర్తా ఇద్దరు పిల్లలు ఉన్నా మేనల్లుడ్ని ప్రేమించిన అత్త

Satyam NEWS

Leave a Comment