38.2 C
Hyderabad
April 28, 2024 22: 55 PM
Slider హైదరాబాద్

చిన్న యూనిట్లకు సబ్సిడీ వస్తు సామాగ్రిని అందించి మంత్రి మల్లారెడ్డి

#ministermallareddy

100 % వంద శాతం సబ్సిడీతో మంజూరైన వస్తు సామాగ్రిని చిన్న యూనిట్ల లబ్దిదారులకు నేడు కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అందచేశారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో  చిన్నతరహా యూనిట్ల సామాగ్రి పంపిణీ కార్యక్రమం నాగారం – రాంపల్లి క్రాస్ రోడ్ సువర్ణ కళ్యాణ వేదిక ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో  కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు రూ. 2,50,000/- విలువగల బాండ్లను అందజేశారు. మొత్తం నలుగురు జంటలు ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు  బాలాజీ,  పి ఆర్వో అశోక్, ఎస్సీ కార్పొరేషన్ అధికార సిబ్బంది నాగారం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి  ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వెలవెలబోయిన తొలి ఏకాదశి పర్వదినం

Satyam NEWS

తెలంగాణ ముద్దు బిడ్డ

Satyam NEWS

Diwali Gift: రైతులకు కిసాన్ యోజన డబ్బు విడుదల

Satyam NEWS

Leave a Comment