40.2 C
Hyderabad
May 5, 2024 15: 45 PM
Slider ప్రత్యేకం

దళిత బంధు తరహాలో ఆదివాసులకు సాయం చేయాలి

#tudumdebba

దళిత బంధు తరహాలో తక్షణమే ఆదివాసులకు కూడా ఆర్ధిక సాయం అందించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కోసం నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం దళితులకు దళిత బందు అమలు చేసినట్లే, అత్యంత వెనకబడిన ఆదివాసులకు కూడా ఆదివాసీ బందును అమలు చేసి ప్రతి కుటుంబానికి వర్తింపచేయాలని వారు కోరారు. ఈ మేరకు వారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ డిమాండ్లు

1) దళిత బందు మాదిరిగానే, ఆదివాసీ బందు ద్వారా ప్రతి ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి.

2) చట్టబద్ధత లేని లంబాడా సామాజిక వర్గం యొక్క ST హాదా రద్దు చేయాలి.

3) ఆదివాసులు సాగుచేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి.

4) ట్రైబల్ యునివర్సిటీ ఆదిలాబాదులొనే ఏర్పాటు చేయాలి.

5) G.O.Ms.no.3 ను యథావిధిగా అమలు చేయాలి.

6) భూమి లేని ప్రతి ఆదివాసీ కుంటుంబానికి (3 ) మూడు ఎకరాల భూమి ఇవ్వాలి.

7) స్పెషల్ DSC ఎర్పాటు చేసి, ఆదివాసీ అభ్యర్థులతొ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.

8) లంబాడా ‘ఎస్టీ’ కుల, ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు జారీ నిలుపుదల చేయాలి.

9) ఆదివాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.

10) ఉట్నూరు గ్రామ పంచాయతీకి వెంటనే ఎన్నికలు జరపాలి.

11) నాన్ ఏజెన్సీ గ్రామాల ఆదివాసులకు ఏజెన్సీ ఆదివాసుల మాదిరిగా అన్ని హక్కులు కల్పించాలి.

అటవీ సాగు భూములకు త్వరలో హక్కు పత్రాలు ఇస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చట్ట సభలో ఇచ్చిన హమీ నేటికి నెరవేర్చలేదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ, జిల్లా కమిటీ ఆదిలాబాదు జిల్లా అధ్యక్షులు గొడం గణేష్, ఉపాధ్యక్షుడు కుంమ్రం శ్యాం రావు, ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు అన్నారు.

Related posts

“కలివీరుడు” ట్రైలర్ విడుదల

Bhavani

హైదరాబాద్ లో భారీ ఎత్తున హవాలా సొమ్ము

Satyam NEWS

పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment