25.2 C
Hyderabad
May 8, 2024 07: 46 AM
Slider మహబూబ్ నగర్

పదోతరగతి పరీక్షాపత్రాల మూల్యాంకనం ప్రారంభం

#deo

పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం గురువారం ప్రారంభమైంది. ఏర్పాట్లను నాగర్ కర్నూల్ జిల్లా పరిశీలకురాలు వెంకట్ నర్సమ్మ, జిల్లా విద్యాశాఖాధికారి  పర్యవేక్షించారు. నాగర్ కర్నూల్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి మూల్యాంకనానికి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 5 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, 44 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 264 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 80 మంది స్పెషల్ అసిస్టెంట్‌లను నియమించారు.   ఒక్కో ఉపాధ్యాయుడు పది నుంచి 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయగా తొలిరోజు 4371 పూర్తయ్యాయని డీఈవో తెలిపారు.

మూల్యాంకన కేంద్రాన్ని క్యాంపు అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరుగకుండా మూల్యాంకనం చేయాలని సూచించారు. అదేవిధంగా రేపు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు క్యాంపుకు హాజరు కావాల్సిన అవసరం లేదని 15వ తేదీ నాడు హాజరుకావాలని డిఇఓ తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, వనపర్తి జిల్లా ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి మధుకర్, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ కురుమయ్య, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఎస్ జి ఎఫ్ ప్రసాద్ గౌడ్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజ్, వెంకటేశ్వర శెట్టి, వెంకటయ్య, వెంకట్ తదితరులు మూల్యాంకన కేంద్రంలో పర్యవేక్షించారు.

Related posts

శ్రీశైలంలో 22 నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి సాయం

Satyam NEWS

క్రీడాకారులకు ములుగు జెడ్పీ చైర్మన్ ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment