37.2 C
Hyderabad
May 6, 2024 19: 05 PM
Slider ప్రత్యేకం

డిజిపిని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు

#AP DGP

ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేశారని రమ్య కుటుంబ సభ్యులు డిజిపికి తెలిపారు. పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని రమ్య కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు రమ్య కుటుంబ సభ్యులు డిజిపి ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

తమ కుటుంబం పైన కొంతమంది  ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని వారు డిజిపికి తెలిపారు. డబ్బులకు అమ్ముడుపోయా మంటు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారని ఆ కారణం గా ఇంట్లో భోజనం చేయలేక పోతున్నామని రమ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల కఠిన  చర్యలు తీసుకోవాలని డీజీపీ ని కోరారు.

రమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని డి‌జి‌పి తెలిపారు. కేసు దర్యాప్తును పోలీసులు  వేగంగా పూర్తి చేశారని తెలిపిన రమ్య కుటుంబ సభ్యులతో ఏకీభవిస్తూ కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని అభినందించారు.

రమ్య కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రమ్య హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసామని ఆయన తెలిపారు. కోర్టులో ట్రైల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా న్యాయస్థానాన్ని కోరుతామని ఆయన తెలిపారు.

Related posts

ఓట‌ర్ జాబితాలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై బీజేపీ ధ‌ర్నా

Sub Editor

జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు నారా లోకేష్ బీమా

Satyam NEWS

పల్లె ప్రగతి పనులపై శ్రద్ధ చూపండి

Satyam NEWS

Leave a Comment