39.2 C
Hyderabad
May 4, 2024 22: 56 PM
Slider కరీంనగర్

రెండు కోట్ల రూపాయల మేరకు రైతుల్ని దోచిన ఘనులు

cheaters

అన్నం పెట్టే అన్నదాతను మోసం చేశారీ దుండగులు. వీరిని ఏమనాలి? గత 5 సంవత్సరాలుగా 10 జిల్లాల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ధాన్యం కొనుగోలు పేరుతో దగా చేసిన అంతర్ జిల్లా ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

వివిధ జిల్లాలకి వెళ్లి, గ్రామాలలో తిరుగుతూ రైతుల దగ్గరకి వెళ్ళి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో కంటే అధిక ధరకు కొనుగోలు చేసి, డబ్బులు వెంటనే చెల్లిస్తామని ఈ ముఠా సభ్యులు చెప్పేవారు. దీనివల్ల మార్కెట్ చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుందని, మాయ మాటలతో అమాయక రైతులను నమ్మించి వారి వద్ద గల ధాన్యాన్ని లారీలలో,వ్యాన్లలో,డిసిఎం లలో దూర ప్రాంతాలకు తరలించేవారు.

అక్కడ వ్యాపారులకు ఎంతో కొంతకి అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ, రైతులను మోసం చేసి, తప్పించుకొని ఈ ముఠా సభ్యులు ఇంతకాలం తిరుగుతున్నారు. ఇలా వందల సంఖ్యలో రైతులను మోసం చేస్తూ,కోట్ల రూపాయల్లో డబ్బులు స్వాహా చేసిన అంతర్ జిల్లా ఘరానా మోసగాళ్లను చాకచక్యంగా కేశవపట్నం పోలీసులు అరెస్టు చేశారు.

ఈ వివరాలను హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో వందల సంఖ్యలో రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి, వారిని మోసం చేస్తూ, డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న ఘరానా మోసగాళ్లను ఎలాగైనా పట్టుకోవాలనే కరీంనగర్ పోలీస్ కమిషనర్, హుజురాబాద్ ఏసీపీ ల ఆదేశాల మేరకు ,హుజురాబాద్ రూరల్ సిఐ కిరణ్, కేశవపట్నం ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

దర్యాప్తు చేస్తున్న క్రమంలో కేశవపట్నం మండలంలోని మొలాంగుర్ క్రాస్ రోడ్ వద్ద ఈ దొంగలు దొరికారు. చాలా మంది పెద్దలతో పరిచయాలు ఉన్నాయని వారు పోలీసుల్ని బెదిరించారు కూడా. ఇలాంటి నేరాలలో ప్రధాన నిందితుడైన శ్రీనివాసరావు ఇది వరకు వరంగల్ జిల్లాలోని మట్టేవాడ, సైబరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనం కేసులలో నిందితుడు.

కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నం, జమ్మికుంట, ఇల్లంతకుంట, పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోని బోయినిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల నుండి ధాన్యం కొనుగోలు చేసి,రైతులను మోసం చేసిన కేసులల్లో జైల్ కి వెళ్లి వచ్చిన కూడా తన పద్దతి మార్చుకోకుండా మళ్లీ మోసాలకు పాల్పడ్డాడు. ఈ ముఠా స్వాహా చేసిన మొత్తం ధాన్యం విలువ దాదాపు 2కోట్లు.

ఈ ముఠాలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లె గ్రామం కు చెందిన కంజర్ల శ్రీనివాసరావు తో బాటు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామం కు చెందిన జువ్వాడి రంగారావు ఉన్నారు. ఈ నిందితులను పట్టుకోవడంలో చాక చక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి, హుజురాబాద్ ఏసీపీ  శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

కమిషనర్ అభినందించిన వారిలో హుజురాబాద్ రూరల్ సిఐ ఇ.కిరణ్, కేశవపట్నం ఎస్సై ఎం.శ్రీనివాస్, సైబర్ సెల్ ఇంచార్జ్ టి.మురళి, కేశవపట్నం కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస్, సైదాపూర్ కానిస్టేబుల్ ఎం.కుమారస్వామి ఉన్నారు.

Related posts

విద్యలనగరంలో “సీత1990లో” చిత్ర షూటింగ్ ప్రారంభం

Satyam NEWS

కాంగ్రెస్ క్లయిమ్: దివాళాతీస్తున్నారని ముందే చెప్పాం

Satyam NEWS

ఈ ఏడాది పుష్క‌లంగా వ‌ర్షాలు పంటలు బాగా పండుతాయి

Satyam NEWS

Leave a Comment