28.7 C
Hyderabad
April 26, 2024 07: 54 AM
Slider సినిమా

విద్యలనగరంలో “సీత1990లో” చిత్ర షూటింగ్ ప్రారంభం

ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలపై , సమాజాన్ని మేల్కొల్పే విధంగా చిత్రాన్ని నిర్మించడం ఎంతైనా అభినందనీయమని ఏపీలోని విజయనగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు.

ఈ మేరకు నగరంలో ని కొత్తపేట రాధా కృష్ణ కళ్యాణ మండపం ఆవరణలో ఈ నగర్ కలలు బ్యానర్ పై ఫెయిల్యూర్ జిందగీ ప్రొడక్షన్స్ నిర్వహణలో నూతనంగా నిర్మిస్తున్న ” సీత 1990 లో” నూతన తెలుగు చిత్రం ప్రారంభ సందర్భంగా ముందుగా ఆమె దేవుని చిత్రపటాలు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి, బ్యానర్పై క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ విజయనగరానికి చెందిన యువత సినిమా పై మక్కువతో నూతన నటీనటులతో సినిమా ను నిర్మించడం అభినందనీయమన్నారు.

యువత చేస్తున్న ప్రయత్నంలో తప్పక విజయం సాధిస్తారని నటీనటులకు ఆమె శుభాభినందనలు తెలిపారు. ఈ సినిమాకు కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న సాయి జాయ్ మాట్లాడుతూ చిత్రాన్ని 15 షెడ్యూల్ లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాలలో షూటింగ్ చేస్తామన్నారు.

అంతా కొత్తవారితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా ప్రమోద్, సంగీత దర్శకుడిగా ఓలేటి శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారని చెప్పారు.

Related posts

పెన్నహోబిలంలో బాలయ్య నూతన చిత్రం షూటింగ్

Bhavani

జెండా కప్పుకుంటేనే సంక్షేమ పథకాల…!

Bhavani

పోలీసులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి

Satyam NEWS

Leave a Comment