38.7 C
Hyderabad
May 7, 2024 16: 51 PM
Slider హైదరాబాద్

డ్రైనేజి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

#bontusridevi

జిహెచ్ఎంసి పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగాన్ని హెచ్ ఎం డబ్ల్యు ఎస్ &ఎస్ బి డిపార్ట్ మెంట్ కు బదిలీ చేయబోతున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. కాప్రా మున్సిపల్ కార్యాలయంలో  శుక్రవారం  UGD విభాగంపై సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశo కాప్రా డీసీ శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీదేవి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(UGD) విభాగాన్నిజీహెచ్ఎంసీ నుంచి తిరిగి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డ్(HMWS&SB) డిపార్ట్మెంట్ కు వచ్చే నెల నుంచి బదిలీ చేస్తున్నారన్నారు.

అదేవిధంగా  UGD విభాగం అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో HMWS&SB జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్, DGM కృష్ణ, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఈఈ కోటేశ్వరరావు, కాప్రా సర్కిల్ కార్పోరేటర్లు స్వర్ణరాజ్, శివమణి, ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జెన్ శేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

క్రిస్టియన్ మతాన్ని కించపరిచిన రవీనా టాండన్

Satyam NEWS

కొత్త దిశ చూపించేందుకు కాంగ్రెస్ చింతన్ శివిర్

Satyam NEWS

సాక్షి దినపత్రికలో సగం భాగం నాదే: వై ఎస్ షర్మిలా రెడ్డి

Satyam NEWS

Leave a Comment