28.7 C
Hyderabad
May 6, 2024 01: 23 AM
Slider విజయనగరం

నిరుద్యోగుల దెబ్బకు అరగంట వాయిదా పడ్డ మంత్రి బొత్స ప్రోగ్రాం

#botsa satyanarayana

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌త రాత్రి వెల‌గ‌పూడి నుంచీ విజ‌య‌న‌గ‌రంకు చేరుకున్నారు. నేడు విజయనగరంలో కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు కూడా. అనంత‌రం 7,8 తేదీల్లో జిల్లాలో ఏర్పాట‌య్యే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

నిరుద్యోగ యువ‌త న‌గ‌రంలోని కోరాడ వీధిలో నివాసం ఉంటున్న మంత్రి బొత్స స‌త్యానారాయణ నివాసాన్ని ముట్టడిస్తార‌ని స‌మాచారం తెలుసుకున్న డీఎస్పీ అనిల్ భారీ స్థాయిలో మంత్రి బొత్స నివాసంముందు బ‌లగాల‌ను మొహ‌రించారు.

ఇద్ద‌రు సీఐలు. ముగ్గురు ఎస్ఐలు,న‌లుగురు ఏఎస్ ఐలు 20 మంది కానిస్టేబుళ్ల‌తో భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేసారు. గ‌త కొద్ది రోజుల నుంచీ అట ఎస్ఎఫ్ఐ ఇటు ఏవైఎఫ్ ఐలు  గంట‌స్థంబం కోట జంక్ష‌న్ వ‌ద్ద  ధ‌ర్నాలు అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచీ స్పంద‌న రాక‌పోవడంతో మంత్రి బొత్స నివాసాన్ని  ముట్ట‌డికి య‌త్నించారు. అయితే  భారీ ఎత్తున పోలీసులు మొహ‌రించి మంత్రి బొత్స నివాసం ఉంటున్న కోరాడ వీధిలో ఇత‌రులెవ్వ‌రూ ప్ర‌వేశించ‌కుండా బారికేట్లు పెట్టారుదీంతో స‌మీపంలోని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ప‌దిన్న‌ర‌కు ప్రారంభించాల్సిన మంత్రి బొత్స కార్య‌క్ర‌మంగంట ఆల‌స్యంగా జ‌రిగింది.

ఈ ధ‌ర్నాలో నిరుద్యోగ యువ‌త‌తో పాటు సీఐలు ముర‌ళీ,లక్ష్మ‌ణ‌రావు,ఎస్ఐ సూర్య‌నారాయ‌ణ‌, ట్రాఫిక్ ఎస్ఐలు భాస్క‌ర‌రావు,దామోద‌ర‌రావు,ఏఎస్ఐ రాజు మ‌హిళా ఏఎస్ఐలతో పాటు ఎస్టీఎఫ్ సిబ్బంది ఉన్నారు

Related posts

శబరిమలలో మహిళల ప్రవేశంపై యథాతధ పరిస్థితే

Satyam NEWS

వేగంగా సాగుతున్న వై ఎస్ వివేకా మర్డర్ కేసు దర్యాప్తు

Satyam NEWS

విన్ అండ్ కం:పురపోరులో విజయ ఢంకా మోగించాలి

Satyam NEWS

Leave a Comment