37.2 C
Hyderabad
May 6, 2024 14: 15 PM
Slider ముఖ్యంశాలు

వ‌చ్చే నెల 15 నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్ ప్రొగ్రామ్

#minister botsa

వ‌చ్చే నెల 15 వ తేదీనుంచీ  త‌మ ప్ర‌భుత్వం  క్లీన్ ఆప్ ఆంధ్ర ప్ర‌దేశ్(క్లాప్) కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న‌ట్టు రాష్ట్ర పురపాల‌క‌,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  తెలిపారు. జిల్లా కేంద్రమైన విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో కొత్త‌గా నిర్మించిన  కార్పొరేష‌న్  స‌మావేశ హాలులో   మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడారు.

త‌మ ప్ర‌భుత్వం అందునా సీఎం జ‌గ‌న్ ప‌రిశ్రుభ‌త్ర‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని అధికారం చేప‌ట్ట‌క‌ముందే ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాలైన  న‌వ‌ర‌త్రాల‌ను ఒక్కొక్కొటీ అమ‌లు చేస్తూ ముందుకు వెళుతున్నామ‌న్నారు.వాస్త‌వానికి వ‌చ్చే నెల 9 నుంచీ  క్లాప్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు.

కాని  అదే నెల 15 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని  ఇందులో మూడు డ‌స్ట్ బిన్ లు ప్ర‌తీ ఇంటికి ముందు ఆగుతాయ‌న్నారు. పొడి చెత్త‌,త‌డి చెత్త‌, ఇత‌ర వ్య‌ర్ధ ప‌దార్ధాల‌తో మ‌రో కుండీ ఇలా మూడు కుండీలు న‌గ‌ర,ప‌ట్ట‌ణాల‌లో ప్ర‌తీ గ‌డ‌ప వ‌ద్ద‌కు వ‌చ్చి చెత్త‌ను ఏరుకుంటార‌ని మంత్రి తెలిపారు. ఇందుకోసం  శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్లు, ఆఫీస‌ర్లు అదే ప‌నిలో ఇప్ప‌టి నుంచీ నిమగ్న‌మై ఉంటార‌న్నారు.

వీఎంసీలో కోటి 46 ల‌క్ష‌ల‌తో  కొత్తగా 3,4 అంత‌స్థుల‌ను ప్రారంభించిన పుర‌పాల‌క మంత్రి బొత్స‌…!

విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లొ కొత్త రెండు అంత‌స్థులు అందుబాటులోకి తెచ్చంది..వీఎంసీ. ఈ మేర‌కు కొత్త‌గా కోటి 46 ల‌క్ష‌ల‌తో కార్పొరేష‌న్ లోని మూడు,నాల్గొవ అంత‌స్థులను మంత్రి బొత్స  స‌త్య‌నారాయ‌ణ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.అనంత‌రం కొత్త‌గా నిర్మించిన లిప్ట్ లో రెండు అంత‌స్థుల‌లో నిర్మించిన  మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ల ఛాంబ‌ర్ ల‌తో పాటు విశాలంగా ఉండే కార్పొరేష‌న్ మీటింగ్ హాలును మంత్రి బొత్స ప్రారంభించారు.

అలాగే థ‌ర్డ్ ఫ్లోర్  లో మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ఛాంబ‌ర్,  ఫోర్త్ ప్లోర్ లో కార్పొరేష‌న్ స‌మావేశపు హాలు,కార్పొరేట‌ర్లు విశ్రాంతి గ‌దల‌ను మంత్రి బొత్ప‌…ఎమ్మెల్యే కోల‌గట్ల‌, మేయ‌ర్ వీ.విజ‌య‌ల‌క్ష్మీ, క‌మీష‌న‌ర్ వ‌ర్మల‌తో కలిసి ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా అటు ఎమ్మెల్యే కోల‌గట్ల‌, వీర‌భ‌ద్ర‌స్వామి, ఇటు మేయ‌ర్,కార్పొరేటర్త‌తో మీడియా స‌మ‌క్షంలో…కొత్త‌గా నిర్మించిన భ‌వ‌న స‌ముదాయాలు ఇరుకుగా ఉన్నాయ‌ని అంద‌రూ కూర్చొని  ఏ విదంగా మార్చొలో నిర్ణ‌యించికుని ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌న్నారు.

ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర స్వామి మాట్లాడుతూ…మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  స‌హ‌కారంతో రెండేళ్ల క్రితం మున్సిపల్ కార్పొరేష‌న్ ను అంకురార్ప‌ణ జ‌రిగింద‌న్నారు.  తొలిసారిగా పుర‌పాల‌క సంఘం నుంచీ  న‌గ‌ర‌పాల‌క సంస్థ గా  ఆవిర్భించిన  ఈ విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో గ‌డ‌చిన రెండేళ్ల‌లో ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ్నారు.

అంత‌కుముందు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మీష‌న‌ర్ వ‌ర్మ మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవ కార్య‌క్రమంలో మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మీ,డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, కో ఆప్ష‌న్ స‌భ్యుడు,కార్పొరేట‌ర్ రాజేష్,ఆశ‌పు వేణు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

మోగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల న‌గ‌రా

Sub Editor

ఛీటింగ్: బాపట్ల ఎంపి సురేష్ పేరుతో భూ దందా

Satyam NEWS

పెట్టుబడుల్ని ఆకర్షించి యువకులకు ఉపాధి పెంచుతాం

Satyam NEWS

Leave a Comment