28.2 C
Hyderabad
April 30, 2025 05: 38 AM
Slider జాతీయం

ఉన్నావ్ రేప్ కేసు నేరస్తుడికి ఉరి శిక్ష విధిస్తారా?

Unnav

ఉన్నావ్‌ రేప్‌ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కుల్దీప్‌కు శిక్ష ఖరారుపై ఈ నెల 19న కోర్టు వాదనలు వింటుంది. ఆ తర్వాత అతనికి శిక్ష ఖరారు చేస్తారు.

దారుణమైన గొలుసుకట్టు నేరాలకు పాల్పడిన  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు మరణ శిక్ష విధిస్తారా లేదా అనే విషయం పై అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. బాధితును బెదిరించడం చంపడం నుంచి అన్ని రకాల నేరాలకు అతడు పాల్పడినందున ఊరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరే అవకాశం ఉంది. సెంగార్‌ను దోషిగా ప్రకటిచండంతో ఆయన కోర్టు హాలులోనే బోరున విలపించారు.

పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(సీ) మరియు ఐపీసీ 376 (రేప్) సెక్షన్‌ కింద సెంగార్‌ను దోషిగా నిర్ధారించారు. అదే విధంగా అతనిపై 363 (కిడ్నాప్) కేసుకూడా ఉంది. ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసినందున ఉరి వేయాలని పలువురు కోరుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు ఈ కేసును బదిలీ చేశారు.

ఈ కేసు ఢిల్లీ కోర్టుకు ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన బదిలీ కాగా, నాటి నుంచి రోజు వారీ విచారణ చేపట్టారు. ఈ కేసులో మరో నిందితుడైన శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

Related posts

వాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో మేఘాల విస్ఫోటనం: తృటిలో తప్పించుకున్న 163 మంది

Satyam NEWS

30న ఏలూరులో బిజిలి మహోత్సవం

Satyam NEWS

రాత్రి కర్ఫ్యూ లాజిక్ ఏమిటన్న వరుణ్ గాంధీ

Sub Editor

Leave a Comment

error: Content is protected !!