29.7 C
Hyderabad
May 2, 2024 06: 04 AM
Slider సినిమా

శివ 143 సాంగ్స్ విడుదల చేసిన పరశురాం

siva 143

నూతన నటీనటులతో రూపొందిన చిత్రం శివ 143. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ను నేడు గీత గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు పరశురాం విడుదల చేశారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ దర్శకుడు సాగర్ శైలేష్ నాకు చాలా కాలంగా తెలుసు ట్రైలర్స్ సాంగ్స్ చూసాను చాలా బాగున్నాయి.

ఈ రోజు చిన్న బడ్జెట్ సినిమా కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించి శివ143 ఇంత బాగా రావటానికి కారణం సీనియర్ నిర్మాత రామ సత్యనారాయణ. ఆయనకు అన్ని కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన సినిమాను మంచి థియేటర్స్ లో విడుదల చేసి సక్సెస్ చేస్తాడన్న నమ్మకం ఉంది.

మ్యూజిక్ డైరెక్టర్ మనోజ్ కొత్త వాడైన బాగా చేసాడు. పాటలు బాగున్నాయి. కెమెరామెన్ సుధాకర్, డిఐ ఎడిటింగ్ శివ ప్రసాద్ ఈ చిత్రానికి ప్లస్ అవుతారు. హీరోయిన్ చాలా బాగుంది అని అన్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ డైరెక్టర్ పరుశురాం బిజీగా ఉన్నా మా సాంగ్ కోసం సమయం కేటాయించి విడుదల చేశారు.

ఆయన సపోర్ట్ మరువలేనిది అని అన్నారు. శివ 143 చిత్రం జనవరి 12న సంక్రాంతికి విడుదలై సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు. డైరెక్టర్ శైలేష్ సాగర్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ కు సపోర్ట్ చేస్తున్న పరుశురాంకు ధన్యవాదాలు తెలిపారు.

నటీనటులు: సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ సాంకేతిక నిపుణులు: డైరెక్టర్: జె.కరుణ కుమార్, నిర్మాత: బి.ఓబుల్ సుబ్బారెడ్డి, కథ – మాటలు: జక్కా హరిప్రసాద్, సంగీతం: యాజమాన్య, లిరిక్స్: రాంబాబు గోషల, పీఆర్ఓ: మధు వి.ఆర్

Related posts

ఉత్సాహం పై నీళ్లు చల్లిన అమిత్ షా

Satyam NEWS

మదినగూడ నారాయణ పాఠశాలలో ఘనంగా మ్యాథమాటిక్స్ డే..

Satyam NEWS

ఆరోగ్య, ప్రమాద భీమా పథకాలు కొనసాగింపు

Satyam NEWS

Leave a Comment