35.2 C
Hyderabad
April 27, 2024 12: 52 PM
Slider కవి ప్రపంచం

పాదాలు

#Nasreen Khan

కాశ్మీరం నుంచి

కన్యాకుమారి దాకా

పరుచుకున్నాయి పాదాలు

పాదాలలా తనమీదుగా

నడుస్తూ పోయినప్పుడల్లా

వాటి రుధిర రోదనలతో

దేశం ఒక అలావా అవుతుంది

శతాబ్దాల హృదయఘోషను

అలవికాని వేదనతో

నెర్రెలు వారిన దేహానికి చికిత్సకై

అలుపెరుగని తపన తనది

పాదాలను ఒడిలో దాచి

నిద్రకాచిన అనుభవాలెన్నో

పుట్టిన ప్రతి నొప్పీ

పాలకుల నిర్లక్ష్యపు నిండు చిహ్నమే

కూడంకులమ్ విద్యుత్ ప్రాజెక్టును వద్దన్న  దూదిపింజ పాదము

రుణమాఫీని వేడుకుంటూ గిలగిలలాడుతూ చీలిన  పాదము

సొంతూరికి నడిచెళ్తూ రక్తాన్ని స్రవించే పాదము

ఏ పాదము ఎటు కదిలినా

చీమ కుట్టని దేహాలకు పట్టదు

కోట్ల లెక్కల్లో మునిగి మభ్యపెట్టే మోసకారి మెదడుకు

కూటి కోసం కదలాడే పాదం గురించి పట్టనైనా పట్టదు

– నస్రీన్ ఖాన్, హైదరాబాద్

Related posts

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Satyam NEWS

ప్రభుత్వం దివ్యాంగులను ప్రోత్సహిస్తుంది

Satyam NEWS

అర్ధ రాత్రి హైదరాబాద్ కోఠి లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

Leave a Comment