భారత్ లోమూడవ ప్రైవేటు తేజస్ రైల్ ప్రారంభ కానుంది.దేశంలో న్యూఢిల్లీ- లక్నో, ముంబై- అహ్మదాబాద్ మధ్య ప్రైవేటు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఫిబ్రవరి 16న మరో ప్రైవేటు ట్రైన్ ప్రారంభం కానుంది. కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ పేరుతో ఈ రైలు వారణాసి-ఇండోర్ మధ్య నడవనుంది.
ఐఆర్‌సీటీసీ సారధ్యంలో నడిచే ఈ కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా ఫిబ్రవరి 16 నుంచి వారణాసి నుంచి ప్రారంభం కానుంది.జనం ఆదరిస్తుండటం తో దేశం లో మరిన్ని ప్రైవేట్ రైల్ లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తుంది.