40.2 C
Hyderabad
May 5, 2024 17: 22 PM
Slider ముఖ్యంశాలు

ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల ఎన్నికలు

జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, పంచాయతీలకు, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీల్లో వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పంచాయతీ వార్డులు, పంచాయతీలు, మున్సిపాలిటీలో వార్డులు, ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో కమిషనర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జనవరిలో రూపొందించిన ఓటరు జాబితా నుంచి ఖాళీగా ఉన్న స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా త్వరితగతిన రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తుది ఓటర్ల జాబితా పై సమావేశం నిర్వహించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.

ముసాయిదా ఓటరు జాబితా, స్థానిక పంచాయతీలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ఆయన తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా పై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటర్ల నమోదు దరఖాస్తులు పరిశీలించి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు.

ఏప్రిల్ 21 నాటికి తుది ఓటరు జాబితాను వార్డుల వారీగా తయారు చేసి నోటిఫైచేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 23 నాటికి ఎంపిటిసి స్థానాలకు, జడ్పిటిసి స్థానాలకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదల చేసి ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలు గుర్తించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. బ్యాలెట్ బాక్సులు, ఇంక్ బాటిళ్లు మొదలైన ఎన్నికల సామాగ్రి సంసిద్ధం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో అవసరమైన ఎన్నికల సామాగ్రి అందుబాటులో లేని పక్షంలో పక్కన జిల్లా నుంచి తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఓటర్ల తుది జాబితాను ప్రభుత్వ కార్యాలయాల్లో, పంచాయతీ ఆఫీసులలో,జిల్లా వెబ్సైట్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.

అన్ని జాగ్రత్తలతో ఓటర్ల జాబితా

గ్రామ పంచాయతీ వార్డుల్లో ఓటర్ల జాబితా తయారు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఒక వార్డులో ఓటరు మరో వార్డులో ఉండకుండా జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణను చాలా పకడ్బందీగా తీసుకోవాలని అలసత్వం వహించడవద్దని ఆయన పేర్కొన్నారు.

జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి అనువైన ప్రింటింగ్ కేంద్రాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ సిబ్బంది గుర్తించాలని ఆయన సూచించారు.

ఎన్నికల బుక్లెట్ లను రిటర్నింగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ముందస్తుగానే ఎంపిక చేసుకోవాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు లో నమోదు చేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్బంగా నాగర్ కర్నూల్ జిల్లా నుండి విడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ జిల్లాలో 15 సర్పంచ్ లు, 124 వార్డు సభ్యులు, 2 ఎంపిటిసి స్థానాలు ఖాళీగా ఉన్నాయని వాటిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇచ్చిన సూచనలు పాటించి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధతం అవుతామని తెలియజేసారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా డి.పి.ఓ కృష్ణ, డిప్యూటీ జడ్పి సిఇఓ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్. నెట్, కొల్లాపూర్

Related posts

శ్రీలంక ప్రధానమంత్రికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం

Satyam NEWS

రాయదుర్గం లాకప్ డెత్ కేసులో సి.ఐ సహా నలుగురు సస్పెన్షన్

Bhavani

అనుమానాస్పద స్థితిలో బిలియనీర్ మృతి

Satyam NEWS

Leave a Comment