27.7 C
Hyderabad
May 15, 2024 03: 37 AM
Slider అనంతపురం

రాయదుర్గం లాకప్ డెత్ కేసులో సి.ఐ సహా నలుగురు సస్పెన్షన్

#digmraviprakash

అనంతపురం జిల్లా రాయదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో కురబ రామాంజినేయులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సి.ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు మధు బాబు, గంగన్న, హోంగార్డు రమేష్ లను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లిని విచారణ అధికారిగా నియమించి ఆ ప్రాథమిక నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని రేంజ్ పరిధిలోని పోలీసు అధికారులకు డిఐజి ఆదేశాలు జారీ చేశారు. పోలీసు స్టేషన్లకు ఎవర్నీ అనవసరంగా తీసుకురాకూడదని… అవసరమై పిలిపించినా వెంటనే విచారించి 24 గంటల్లోపు కోర్టుముందు హాజరు పరచాలన్నారు.

ఇలా కాకుండా రాయదుర్గం తరహా ఘటనలకు తావిస్తే ఎస్సైలు, సి.ఐ లనే కాదు డీఎస్పీలపై కూడా చర్యలు తప్పవని డిఐజి హెచ్చరించారు.

Related posts

కోవిడ్ నిబంధనలు సచివాలయానికి వర్తించవా?

Satyam NEWS

కరోనా కంట్రోల్ నిధికి భారత్ విరాళం రూ.70 కోట్లు

Satyam NEWS

సరిహద్దుల్లో మొహరించి ఉన్న ఎయిర్ ఫోర్స్

Satyam NEWS

Leave a Comment