39.2 C
Hyderabad
May 4, 2024 22: 54 PM
Slider సినిమా

అంతేగా అంతేగా:సెట్స్ పైకి వెళ్లనున్న అసురన్ రీమేక్

venkatesh as asuran

వెంకీ మామయ్య హిట్ తో దూకుడు మీదున్న రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ వెంకటేష్ నటించనున్న మరో సినిమా అసురన్ . జనవరి 20నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. ప్రియమణి హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఉర్రూతలూగించింది. బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులు సృష్టించడంతో ఈ సినిమా తెలుగు రీమేక్ చేస్తున్నారు.. సినిమా మొత్తం రెండు నెలల్లో పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

అయితే ప్రధాన పాత్రలో వెంకటేష్ ఇప్పటికే ఖరారు కాగా, మరో యువ హీరో కోసం వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. వెంకటేష్ పక్కా పల్లెటూరి మాస్ మనిషిగా కనిపించనున్నారు.రాయలసీమ ప్రాంతమైన అనంతపురం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 30 రోజులపాటు షూటింగ్ జరగనున్నది

Related posts

శాసనమండలి ఎన్నికల్లో నవతరంపార్టీ పోటీ

Satyam NEWS

తిరుపతి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Bhavani

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Satyam NEWS

Leave a Comment