19.7 C
Hyderabad
December 2, 2023 05: 34 AM
Slider ఖమ్మం

దరఖాస్తుల తనిఖీ వేగంగా చేయాలి

#B. Satyaprasad

స్పెషల్ సమ్మరి రివిజన్-2023 ని వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. అదనపు కలెక్టర్ వైరా తహశీల్దార్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరి రివిజన్-2023 ప్రక్రియ పురోగతిని తనిఖీ చేశారు. ఫారం-6, 7, 8 ల క్రింద ఎన్ని దరఖాస్తులు వచ్చింది, ఎన్ని దరఖాస్తులు పరిష్కరించింది పరిశీలించారు.

క్షేత్ర స్థాయి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. దరఖాస్తుల నమోదుకు ఈ నెల 19 వరకు గడువు ఉన్నందున, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు అన్నారు. 1 అక్టోబర్, 2023 నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండే ప్రతిఒక్కరూ ఓటుహక్కు పొందేలా చర్యలు చేపట్టాలన్నఅదనపు కలెక్టర్ తనిఖీ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసరావు, నయాబ్ తహసీల్దార్ రహీమ్ తదితరులు ఉన్నారు.

Related posts

మీ కుటుంబ పాలనలో ఆడపడుచులు భాగం కాదా?

Satyam NEWS

ములుగు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తం

Satyam NEWS

పేదలకు నిత్యావసరాలు అందచేసిన బిజెపి నేతలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!