38.2 C
Hyderabad
April 28, 2024 21: 38 PM
Slider కడప

ఏపీలో జైళ్లు సరిపోకపోతే లాడ్జిలు బుక్ చేసుకోండి

#TDP

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రాజంపేటలో మూడవరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కష్టకాలంలో తెదేపాకు అండగా ఉండి అడ్డంకులు అధిగమిస్తా మని ప్రతిన బూనారు. అనంతరం చంద్రబాబు విడుదల కావాలని రాజంపేట పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 టెంకాయలు కొట్టారు. అలాగే మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ముస్లిం సోదరులతో కలిసి మసీదుల్లో దువా చేశారు.

దీక్షలో వైకాపా ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. అలాగే ఈ దీక్షలో జనసేన పార్టీ నాయకులు రాజంపేట ఎంపీ అభ్యర్థి ముకరం చాంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి అతిగారి దినేష్, మండల పార్టీ నాయకులు రామా శ్రీనివాసులు, అబ్బిగారి గోపాల్, రమూర్తి, విజయ్, నాగరాజ ఇంకా పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని బత్యాల గారిని కలిసి సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ అందరినీ జైల్లో పెడతామని అత్యుత్సాహంగా మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ రోజమ్మ నీ బతుకు అందరికీ తెలిసిందే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని జైల్లో పెడతారో పెట్టండి ప్రతిఘటిస్తాం, ఇందులో తగ్గేదే లేదు, ఒక్కరికి వందమందిగా పుట్టి చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యేంతవరకు శాంతియుతంగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. దమ్ముంటే మమ్మల్ని అందరినీ అరెస్టు చేయండి, ఆంధ్రప్రదేశ్లో జైల్లు సరిపోకపోతే రాష్ట్రంలో ఉన్న లాడ్జిలు అన్నింటినీ ముందుగానే బుక్ చేసుకోండి అంటూ దుయ్యబట్టారు.

గతంలో ఎమర్జెన్సీ పెడితే అప్పటి హోమ్ మినిస్టర్ కాసు బ్రహ్మానందరెడ్డి ని మీడియా వారు మీరు ఎంత మందిని అరెస్టు చేశార ని ప్రశ్నిస్తే 65 కోట్ల జనాభా గాను ఒక శాతం మందిని అరెస్టు చేసి జైలుకు పంపించామని దీంతో ఇందిరాగాంధీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని ఆయన వివరణ ఇచ్చారని గుర్తు చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాజంపేట శ్రీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలకు కూడా కొన్ని కంప్యూటర్లు కొన్ని యంత్రాలు కూడా వచ్చాయని ప్రత్యేక ల్యాబులు కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు మరి వైకాపా నాయకులు సిఐడి సంజయ్ కి ఇవన్నీ కనపడలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కింద ఏ ఏ కళాశాలలో ఎన్ని ల్యాబులు ఏర్పాటు చేశారు? ఎన్ని యంత్రాలను, ఎన్ని కంప్యూటర్లు ఇచ్చాం అనే లిస్టు తీస్తున్నామని వాటి వివరాలన్నింటినీ త్వరలోనే బయటపెడతామని చెప్పారు.

స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ పొంది సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడి లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటున్న అన్ని ప్రాంతాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేలు జరిగిందని చంద్రబాబుకు మద్దతుగా ధర్నాలు చేస్తుంటే వైకాపా నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు కోసం చంద్రబాబును అరెస్టు చేయించి జైల్లో పెట్టడం దారుణమన్నారు.

సిఐడి విభాగ అధిపతి సంజయ్ తో న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తోక తొండం లేకుండా మాట్లాడడం మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాటలు దాటు వేయడం వైకాపాకు వత్తాసు పలకడం అన్యాయమని తెలిపారు‌.

ఈరోజు చంద్రబాబు గారి సతీమణి రాజమండ్రి జైలుకు తన భర్తను చూడాలని వెళితే పర్మిషన్ కూడా ఇవ్వకపోవడం చూస్తుంటే వైకాపా నాయకులకు జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష సాధింపు ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పారు. ఈ గోడు త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి తగులుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

మార్చి 31 నుండి ఎత్తివేత

Sub Editor 2

[Over-The-Counter] Triceratops Male Enhancement Best Pills For Erectile Dysfunction Height Xl Pills Review

Bhavani

దళిత భూముల స్వాహారాయుళ్లపై కొనసాగుతున్న ఉద్యమం

Satyam NEWS

Leave a Comment