నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి నూతన గృహప్రవేశ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో హుజూర్ నగర్ నియోజకవర్గ వైయస్సార్ టి.పి నియోజకవర్గ ఇన్చార్జి ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి వైయస్సార్ టి.పి పార్టీకి రాజీనామా చేసి,నియోజకవర్గం లోని ఏడు మండలాలకు సంబంధించిన వైయస్సార్ టి.పి మండల అధ్యక్షులు,వెయ్యి మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి మూడు రంగుల కండవాలు కప్పి వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆదేర్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించటంలో తమ వంతు పాత్ర కూడా పోషిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరితో కలిసి పనిచేస్తూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అందరం కృషి చేద్దామని అన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్
రాష్ట్రంలో ఉన్మాద పాలన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి