38.2 C
Hyderabad
May 5, 2024 22: 44 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం లా అండ్ ఆర్డ‌ర్ డీఎస్పీగా త్రినాధ్ నియాక‌మం

#dsp

ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ ఏఎస్పీగా పదోన్నతి పై గుంటూరుకు బ‌దిలీ

విజ‌య‌న‌గ‌రం లా అండ్ ఆర్డ‌ర్ డీఎస్పీగా త్రినాధ్ నియ‌మితులైనారు.ఈ మేర‌కు డీఎస్పీ కార్యాల‌యంలో…త్రినాద్ కు…బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు…ఇంచార్జ్ డీఎస్పీ అనిల్. వాస్త‌వానికి ఇంచార్జ్ డీఎస్పీ అనిల్ కు కొద్ది రోజుల క్రిత‌మే ఏఎస్పీగా ప‌దోన్న‌తి వ‌చ్చింది.

అయితే రాష్ట్ర‌పోలీస్ శాఖ నుంచీ బదిలీ ఉత్త‌ర్వులు వ‌చ్చేంత‌వ‌ర‌కు ఇంచార్జ్ డీఎస్పీగా ఉన్నారు. తాజాగా దిశ డీఎస్పీ త్రినాధ్…విజ‌య‌న‌గ‌రం డీఎస్పీగా బ‌దిలీ కావ‌డం ఈ మేర‌కు డీఎస్పీ ఆఫీసులో ఇంచార్జ్ డీఎస్పీ అనిల్…త‌న బాధ్య‌త‌ల‌ను డీఎస్పీ త్రినాద్ కు అప్ప‌గించారు.

అందుకు ముందు రోజు విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ ఆఫీసులో ఏఎస్పీ అన‌ల్ కుటుంబాన్ని..పోలీస్ శాఖ స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా ఎస్పీ దీపిక మాట్లాడుతూ… ప‌దోన్న‌తి వ‌చ్చినా…చాలా కాలం.. స‌బ్ డివిజ‌న్ లో ఇంచార్ డీఎస్పీగా ఉంటూ ఎన్నో కేసుల‌లో ముద్దాయిల‌ను ప‌ట్టుకున్నార‌న్నారు. ముఖ్యంగా దిశ యాప్ ను ప్ర‌జ‌ల‌లోకి తీసుకెళ్ల‌డంతో అనిల్ పాత్ర అమోఘ‌మ‌న్నారు.

మొత్తం వారం రోజుల పాటు రోడ్ మ్యాప్ ఇచ్చి…ఇంచార్జ్ ల‌ను నియ‌మించి..చివ‌ర‌కు న‌గ‌రంలో క‌స్మా హైస్కూల్ లో పెట్టి సక్స‌స్ చేసార‌ని ఎస్పీ దీపిక అన్నారు. మ‌రీ ముఖ్యంగా విజుబుల్ పోలీసింగ్ ను తీసుకు రావ‌డం.. అలాగే ట్రైనీ ఎస్ఐల‌తోనే అచూకీ లేని రాని ప‌లు కేసుల‌ను ప‌రిష్క‌రించిన ఘ‌ట‌న ఏఎస్పీ అనిల్ దే న‌ని ఎస్పీ దీపిక అన్నారు.

ఈ సంద‌ర్బంగా విజయనగరం డిఎస్పీగా పనిచేసి, అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, గుంటూరు అర్బన్ శాంతిభద్రతల విభాగంకు బదిలీపై వెళ్తున్న అనిల్ పులిపాటి , ఆయన సతీమణి రోహిణి ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా పోలీసుశాఖ తరుపున ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేసి, డిఎస్పీగా పోలీసుశాఖకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్య‌ క్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, డిఎస్పీలు టి.త్రినాథ్, ఆర్.శ్రీనివాస రావు, వీర‌కుమార్, ఎల్.శేషాద్రి, పలువురు సిఐలు, ఎస్ఐ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

Bhavani

మత్తు పదార్ధాలతో చిత్తు కావద్దు

Satyam NEWS

రేపు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన

Satyam NEWS

Leave a Comment