28.7 C
Hyderabad
May 5, 2024 08: 26 AM
Slider నిజామాబాద్

ఎంపీ ధర్మపురి అరవింద్ పైన దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి

#mparavind

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద భారత రాజ్యాంగం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (బి.డి.ఎస్.ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎల్. ఎన్.ఆజాద్  మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల భారత రాజ్యాంగం పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు.

భారత రాజ్యాంగాన్ని మారుస్తాము, మేము పార్లమెంట్ లో ఉన్నాము, సెక్యులర్ అనే పదాన్ని తొలగిస్తాను అని మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం మీ తరం కాదన్నారు ,ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి 90% ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ప్రజల జీవితాలు ఈరోజు ఉన్నత కులాల తో సమానంగా డెవలప్ కావడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడుతుందన్నారు.

ధర్మపురి అరవింద్ ఎంపీగా ఎలెక్ట్ కావడానికి కారణం భారత రాజ్యాంగమన్నారు. భారత దేశమంటేనే భిన్నత్వంలో ఏకత్వం. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం తీసేస్తా అంటున్న ఎంపీ అరవింద్ కి అదే పదం వాళ్ల బిజెపి పార్టీ మేనిఫెస్టోలో ఉండని తెలియనందుకు బాధపడాలని అన్నారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇటీవల కేసీఆర్ రాజ్యాంగ మార్పు అంటే ధర్నాలు,దీక్షలు చేసిన విధంగానే ఇప్పుడు అరవింద్ అదే మాట అంటుండు, ఇప్పుడు ఆయన ఇంటి ముందు కూడా ధర్నా పెట్టి పార్టీలో నుండి సస్పెండ్ చేయాలన్నారు. లేకుంటే బిజెపి నాయకుల ఇళ్ళ ముందు నిరసన ర్యాలీలు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బామ్సేఫ్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి నరేందర్, బి .డి .ఎస్. ఎఫ్.రాష్ట్ర కార్యదర్శి జి.వి. ఎం.విటల్ ,జిల్లా అధ్యక్షులు ఎంపీ. స్టాలిన్ ,కార్యదర్శి డి.నరేందర్, జిల్లా అధ్యక్షులు బుల్లెట్, కార్యదర్శి యశ్వంత్,మోహన్, ఉపాధ్యక్షులు ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు. జి. లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

దళితబంధు లబ్దిదారునికి టాటా ఏస్ గూడ్స్ వాహనం అందజేత

Satyam NEWS

పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

Satyam NEWS

రైతుల నుంచి ధాన్యం సేకరించే వాహనాలకు జియో ట్యాగింగ్

Satyam NEWS

Leave a Comment