39.2 C
Hyderabad
May 4, 2024 22: 57 PM
Slider ముఖ్యంశాలు

పది రోజుల‌లో ఖ‌రీదైన 12 స్మార్ట్ ఫోన్ లు ల‌భ్యం…ఎలా దొరికాయంటే…?

#VijayanagaramPolice

ప్ర‌స్త‌త స్మార్ట్ యుగంలో ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. జేబులో  పెన్ను లేదా డ‌బ్బు లేక‌పోయినా ప‌ర్వా లేదు గాని ఓ స్మార్ట్ ఫోన్ లేక‌పోతే ఆదో షేమ్ గా ప్ర‌తీ ఒక్క‌రూ  ఫీల‌య్యే ప‌రిస్తితి. స్మార్ట్ ఫోన్ ఖ‌రీదు క‌నీసం..ప‌ది వేలు అంత‌కుమించి ఖ‌రీదులో ఉన్నా కూడా ప్రతీ ఒక్క‌రి జేబులో త‌ప్ప‌ని స‌రి  అయిపోయింది.

ఒక వేళ ఆ స్మార్ట్ ఫోన్ పోతే …జేబులోంచి జారి ప‌డిపోతే..ఎక్క‌డైనా మ‌ర్చిపోతే..ఎవ్వ‌రైనా దొంగ‌లిస్తే ఇక అంతే తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. కాని ఏపీలోని విజ‌య‌న‌గ‌రం లో వ‌న్ టౌన్ పోలీసులు మాత్రం అలాంటి స్మార్ట్ ఫోన్లు పోవ‌డంతో స్టేష‌న్ కు వ‌చ్చిన ఫిర్యాదులు స్వీక‌రించిన అనంత‌రం వాటిని  వెతుక‌లాట‌లో ప‌డ్డారు.

అందుకు స్టేష‌న్ సీఐ ముర‌ళీ ఆదేశాల‌తో  కానిస్టేబుల్ హేమంత్ త‌న‌కున్న సెల్ ఫోన్ పరిజ్ఞానాన్ని కాస్త వెతుకులాట‌కు ఉప‌యోగించాడు. పోయిన సెల్ ఫోన్ లో సీడీఎం నెంబ‌ర్ ఆధారంగా…లోకేష‌న్ క‌నుక్కుని సంబంధిత స్మార్ట్ ఫోన్ ఎక్క‌డున్న‌దీ క‌నుక్కున్నాడు.

ఇలా  ప‌ది రోజుల్లో  పోయిన 12 స్మార్ట్ ఫోన్ ల‌ను కనుక్కున్నాడు. వెంట‌నే స్టేషన్ సీఐ ముర‌ళీకి అప్ప‌గించారు. నిబద్ధ‌త‌తో ప‌ని చేస్తున్న సీఐ ముర‌ళీ క్ష‌ణం ఆగ‌కుండా…త‌మ సెల్ పోన్ లు పోయాయ‌ని ఫిర్యాదు చేసిన వాళ్ల‌ను స్టేష‌న్ కు పిలించి…ఎవ‌రి సెల్ పోన్ ల‌ను త‌మ స్టేష‌న్ సిబ్బంది అయిన ఏఎస్ఐ,హెచ్.సీ.కానిస్టేబుళ్ల ద్వారా ఇప్పించారు.

ఇదీ పోలీసు విధి నిర్వ‌హ‌ణ అంటే.ఇక త‌మ సెల్ పోన్ పై ఆశ వ‌దులుకున్న ఫిర్యాదుదారుల‌కు స్టేష‌న్ కు వ‌చ్చి  తాము క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న సెల్ పోన్ లు తమ చేతిలో స్వ‌యంగా పోలీస్ సిబ్బంది చేతిలో పెడితే గాని త‌మ ఫోన్ లు  దొరికాయ‌న్న న‌మ్మ‌కం కుదులేదు.

ఏదైనా ఈ సెల్ పోన్  ను ఓ చిన్న‌సాంకేతిక ప‌రిజ్ఙానంతో క‌నుగొన్న వ‌న్ టౌన్ సిబ్బంది కానిస్టేబుల్ హేమంత్..స‌త్యం న్యూస్.నెట్ నీకు చెబుతోంది..హేట్సాఫ్.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

పదో తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్య

Satyam NEWS

ఆయన లేనిదే అక్కడ ఎవ్వరూ జాతీయ జెండా ఎగురవేయలేరు..!

Satyam NEWS

ప్రజా సంగ్రామ యాత్ర @ 100 రోజులు…

Satyam NEWS

Leave a Comment