37.2 C
Hyderabad
April 30, 2024 11: 45 AM
Slider కవి ప్రపంచం

కార్మిక కర్షక హ్యాపీ డే…

#Purimalla Sunanda Khammam

పొద్దును నెత్తికెత్తుకుని

లోకంలో సుఖాల వెలుగులు నింపేందుకు

చిందించిన చెమట చుక్కల్లో

చిరునవ్వులు పూచిన వేళ..

కన్నీళ్ళు నిండిన కళ్ళలో

కాంతులు విరజిమ్మిన  సమయం…

ఫాక్టరీల పడగ నీడల్లో

యంత్ర భూతాల కోరల్లో

భగ భగ లాడే కొలుముల్లో

అంతస్తుల నిర్మాణంలో

శ్రమ దోపిడీకి గురవుతున్న

కార్మిక కర్షకులంతా ఏకమై…

పని గంటల సాధనకై

కనీస వసతుల హక్కులకై

చేసిన ఉద్యమం ఫలించి

కార్మికుల కష్టాలన్నీ నెరవేరిన రోజు!

ప్రాణాలను పణంగా పెట్టి

సాధించుకున్న విజయోత్సవ రోజు

బతుకుల్లో పున్నమి వెలుగులు నింపిన రోజు

ప్రపంచ పటంలో చికాగో నగరం సాక్షిగా

గెలుపు కేతనం ఎగరేసిన రోజే మేడే..

కార్మిక కర్షక హ్యాపీ డే!

వురిమళ్ల సునంద, ఖమ్మం, 9441815722

Related posts

సంపూర్ణ ఆరోగ్యానికి తొలి వెయ్యి రోజుల స‌మ‌తుల ఆహార‌మే కీల‌కం

Satyam NEWS

వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను జయించవచ్చు

Satyam NEWS

ప్రభుత్వ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

Satyam NEWS

Leave a Comment