29.7 C
Hyderabad
May 4, 2024 05: 51 AM
Slider ప్రత్యేకం

మావోయిస్టు నంటూ ఓ ఆర్మీ ఉద్యోగి…5 కోట్ల డిమాండ్…!

#VijayanagaramSP

తాను ఝార్ఖాండ్ కు చెందిన మావోయిస్టు నంటూ… ఉత్త‌రాంద్ర‌లోని ఓ వ్యాపారికి టోపీ వేద్దామ‌నుకున్న ఓ కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగి ఆట క‌ట్టించారు…ఏపీలోని విజ‌య‌న‌గ‌రం  జిల్లా పోలీసులు.

మ‌రి కొద్ది రోజుల్లో డీఐజీ గా చార్జ్ తీసుకోబోతున్న జిల్లా ఎస్పీ రాజ‌కుమారి వ్యూహర‌చ‌నతో ఎట్ట‌కేల‌కు స‌ద‌రు ఆర్మీ ఉద్యోగిని రిమాండ్ లోకి తీసుకోవ‌డం..ఆర్మీ ఉన్న‌తాధికారుల‌కు జ‌రిగిన ఘ‌ట‌న చేర‌వేయ‌డం అన్నీ చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి.

ప్ర‌త్యేకించి.. క‌రోనా స‌మ‌యంలోనే పార్వ‌తీపురం డీఎస్పీగా బాధ్య‌త‌లు తీసుకున్న సుభాష్ స‌మ‌క్షంలో…ఏజెన్సీ ఏరియా పోలీసులు… ల‌క్ష్మ‌ణ్ రావు,తిరుప‌తిరావు,పార్వ‌తీపురం పోలీసుల బృందంతో..స‌ద‌రు ఆర్మీ ఉద్యోగి అయిన‌ ముద్దాయిని ప‌ట్టుకుని విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీసు కార్యాల‌యంలో ఆర్మ్డ్ ఆఫీసుపైన ఉన్న‌ కాన్ఫ‌రెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియ ఎదుట ప్ర‌వేశ పెట్టారు.

అనంర‌తం ఎస్పీ రాజ‌కుమారీ…కేసును ఎలా చేధించామో…మీడియాకు తెలిపారు.పార్వ‌తీపురం బంటువాని వ‌ల‌స‌కు చెందిన‌  27 ఏళ్ల క‌లిగిన  ఆర్మీ ఉద్యోగి..సెల‌వుపై సొంత గ్రామానికి వ‌చ్చారు. గ‌తంలో అత‌గాడు ఓ భూమికి సంబందించి 22 లక్ష‌లు తీసుకున్న మీద‌ట తిరిగి ఎలా చెల్లించాలో తెలియని ప‌క్షంలో..సెల‌వుపై రావ‌డంతో…అదీ ఏజెన్సీ ఏరియా కావ‌డంతో మావోయిస్టు న‌ని చెదిరించి డ‌బ్బులు పొంద‌వ‌చ్చ‌న్న ఆలోచ‌నను అమ‌లు చేసాడు.

దీంతో పార్వతీపురం ప‌ట్ట‌ణంలో బంగారు వ్యాపారి ఇండుపూరి చిన గుంప స్వామిని ఫోన్ లో తాను ఝార్ఖాండ్ కు చెందిన మావోయిస్ట్ ద‌ళ క‌మాండెంట్ అని బెదిరించాడు.అంత‌కు ముందురోజు తాను ప‌ని చేసే చోటే  7.65 వెప‌న్ ను  కొనుగోలు చేసి దాంతో  స‌ద‌రు వ్యాపారి ఇంటి వ‌ద్ద‌ బెదిరింపు  కాల్పుల‌కు పాల్ప‌డ్డారు.

ఆ కాల్స‌లు విష‌యంపై అస్స‌లు తెలియ‌న ఆ వ్యాపారి..త‌న ఇంటిపై దాడి చేసాడ‌ని..రెండు రోజుల తర్వాత  ఫోన్ లో బెదిరించాడ‌ని పార్వ‌తీపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.దీంతో ప‌ట్ట‌ణ డీఎస్పీ సుభాష్..  సున్నిత‌మైన అంశంగా భావించి…ముందుగా త‌న పై అధికారిణి అయిన ఎస్పీ కి తెలియ జేసి ఆమె ఇచ్చిన వ్యూహ ర‌చ‌న‌తో …త‌న స‌హ‌చ‌ర బృందంతో ఎట్ట‌కేల‌కు ఆర్మీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.

అత‌ను బెదిరించిన వెపన్ ను మీడియా ముందు ప్ర‌వేశ పెట్టారు…జిల్లా పోలీసులు. ఏదైనా మ‌రికొద్ది రోజుల్లో డీఐజీగా ప‌దోన్న‌తి పొంద‌బోతున్న ఎస్పీ రాజ‌కుమారికీ… ఈ ఘ‌ట‌న‌..అదీ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటు చేసుకోవ‌డం..ఆమె ప‌నిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌నే చెప్పాలి.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్

Related posts

రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న వైసిసి

Satyam NEWS

ఎలర్ట్: కాటేదాన్ చిరుత ఇంకా చిక్కలేదు జాగ్రత్త

Satyam NEWS

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పేరుతో అవమానం

Satyam NEWS

Leave a Comment