30.7 C
Hyderabad
May 5, 2024 06: 40 AM
Slider విజయనగరం

ఎండ‌ను లెక్క చేయకుండా సిబ్బందిని అలెర్ట్ చేస్తున్న పోలీస్ బాస్…!

#police

నాటి ఎస్పీల‌కు ధీటుగా ప‌నిలో “దూకుడు”: స‌త్యం న్యూస్.నెట్ ప‌రిశోద‌న‌లో ఆస‌క్తిక‌ర అంశాలు

“పోలీస్ అంటే..చ‌ట్టం,ధ‌ర్మం,న్యాయం అంటూ మూడు సింహాల‌ను నెత్తిన పెట్టుకున్న వాడే..” ఈ డైలాగ్ ఎక్క‌డో విన్న‌ట్టుంది క‌దూ…అదేనండీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమాన్  హీరో గా న‌టించిన పోలీస్ స్టోరీ లోని దే క‌దా… అవునండీ.. ఆ సినిమాలోనిదే. పోలీసోడు…అస్స‌లు ఖాకీ యూనిఫాం వేసుకున్న ప్ర‌తీ ఒక్క‌రూ నిబద్ద‌త‌తో ప‌ని చేస్తార‌ని…ఆ సినిమా చూస్తేగాని అదీ ఆ సినిమాలో హీరో సాయి కుమార్ చెప్పిన త‌ర్వాత‌…స‌మాజంలో ప్ర‌తీ ఒక్క పోలీస్ కు గుర్తింపు..అలాగే ప్ర‌జ‌లంతా..సెల్యూట్ చేయ‌సాగారు. ఇప్పుడు పాయింట్ కు వ‌స్తే…సార్వ‌త్రిక ఎన్నిక‌లు సజావుగా సాగాల‌న్నా..ప్ర‌తీ ఒక్క ఓట‌రు ధైర్యం త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోవాలన్న‌…అందుకు పోలీసు ప్ర‌ధాన అవ‌స‌రం.ఈ సంగ‌తెలా ఉందో  ఏమోగాని…అందుక‌నుగుణంగానే…ప్ర‌తీ పోలింగ్ స్టేష‌న్ ను నిశితంగా క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు…విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపిక‌. నిన్న కాక మొన్న‌…జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ,లెండీ,కాలీజేల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేసి…ఆమె…తాజాగా బొబ్బిలి స‌ర్కిల్ లో ప‌ర్య‌టించారు.ప్ర‌ధానంగా…అంత‌ర్ జిల్లా చెక్ పోస్ట్ ల‌ను వ‌ద్ద సిబ్బంది ప‌నితీరును ప‌రిశీలించారు. ప‌క్క జిల్లాల అక్ర‌మంగా…తెలియ‌కుండా…గంజాయి,డ్ర‌గ్స్, డ‌బ్బ‌లు  పంపిణీ వంటిపై  దృష్టి పెట్టాల‌ని కూడా  ఎస్పీ…త‌న త‌నిఖీల‌లో సిబ్బందికి త‌గు సూచ‌న‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఏదైనా…ఓ యంగ్ అండ్ డైన‌మిక్…లేడీ..గతంలో జిల్లాలో ఎస్పీగా ప‌ని చేసిన  ఓ సౌమ్య మిశ్రా..ఓ స్వాతి ల‌క్రా,ఓభావ‌న స‌క్సేనా,ఓ రాజ‌కుమారిల బాట‌లోనే  ప్ర‌స్తుత ఎస్పీ ఎం.దీపిక పాటిల్ ప‌ని చేస్తున్నార‌నటంలో అతిశ‌యోక్తి  లేద‌నంటోంది…” స‌త్యం న్యూస్.నెట్.”

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

పప్పులో కాలేసిన కేంద్ర మంత్రి.. ఆడుకుంటున్న నెటిజన్లు

Satyam NEWS

సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తత అవసరం

Satyam NEWS

కోవర్టులు: అటు ఇటు మారుతున్న తమ్ముళ్లు

Satyam NEWS

Leave a Comment