29.7 C
Hyderabad
May 4, 2024 04: 47 AM
Slider విజయనగరం

రోడ్ ప్ర‌మాదల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లే మార్గం….!

#vijayanagarampolice

ఇటీవ‌ల త‌ర‌చూ జ‌రుగుతున్న రోడ్ ప్ర‌మాదాల‌కు…ఓ పైపు నిర్ల‌క్ష్యపు డ్రైవింగ్ మ‌రోవైపు మ‌ద్యం సేవించి జ‌రిగినట్టు ర‌వాణ‌,పోలీస్ శాఖ ల ద‌ర్యాప్తులో తేలింది. ఈక్ర‌మంలోనే ముందుగా డ్రైవ‌ర్ల‌కు క్లాస్ తీసుకోవాల‌ని పోలీస్ బాస్ ఆదేశాల‌తో… ఉత్త‌రాంధ్ర‌లో అదీ డిప్యూటీ స్పీక‌ర్ నియోజ‌క వ‌ర్గ‌మైన విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ డీఎస్సీ మోహ‌న్ రావు …చ‌ర్య‌లు తీసుకున్నారు.

అందులో భాగంగా ఇటీవ‌లే త‌మ ట్రాపిక్ సిబ్బంది..రోడ్ల‌పై త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా..ర్యాష్ డ్రైవింగ్… నిర్ల‌క్ష్యంగా వాహ‌నాల‌ను న‌డిపిన వారిని గుర్తించారు. దీంతో వాళ్లంద‌రికి ఫోన్ లు చేసి మ‌రీ న‌గ‌రంలోని ప‌ద్మావ‌తీ న‌గ‌ర్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ కు పిలిపించి వాళ్ల‌కు క్లాస్ లు తీసుకున్నారు…ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు.

దాదాపు 20మందికి డ్రైవ‌ర్ల‌ను స్టేష‌న్ కు పిలిపించారు..ట్రాఫిక్ డీఎస్పీ. వాళ్లంద‌రికి సుతి మెత్తగా… వాహ‌నాల‌ను ఏ విధంగా డ్రైవ్ చెయ్యాలి…అస‌లు రోడ్ ప్ర‌మాదాలు ఎంద‌కు జ‌రుగుతున్నాయి….? అలాంటప్పుడు వాహ‌నాలు న‌డిపే మీరు ఏవిదంగా ఉంటున్నారు..అస‌లు ఏ విదంగా డ్రైవ్ చేస్తున్నారు.? మీ వాహ‌నంలో కూర్చున్న ప్రాణాల‌కు మీరు బాధ్య‌లు కాదా…? లేక‌పోతే…. మిమ్మ‌ల్ని న‌మ్ముకున్న మీ అమ్మ‌,నాన్న‌,.లేదీ మీ భార్య‌,బిడ్డ‌ల సంగ‌తి గుర్తుంటుందా..అంటూ కుశ‌ల ప్ర‌శ్న‌లతో..స్టేష‌న్ కు వ‌చ్చిన వాహ‌న‌దారుల‌కు క్లాస్ తీసుకున్నారు..ట్రాఫిక్ డీఎస్పీ.

ఇదిలా ఉంటే డీఎస్పీ ఆదేశాల‌తో ట్రాఫిక్ ఎస్ఐ భాస్క‌ర‌రావు…న‌గ‌రంలోని ట్యాక్సీ స్టాండ్ వ‌ద్ద‌…డ్రైవ‌ర్ల‌కు వాహ‌నాల‌ను న‌డిపేట‌ప్పుడు.. తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల‌ను క్షుణ్ణంగా వివ‌రించారు.

Related posts

ఆర్మ్ రిజర్వు పోలీసుల కోసం “డీ-మొబిలైజేషన్”

Satyam NEWS

ఎదురుగాలితో వెనక్కి తిరుగుతున్న ‘‘ఫ్యాన్’’

Satyam NEWS

మద్యం షాపుల్ని మహిళలు వ్యతిరేకించడం లేదు

Satyam NEWS

Leave a Comment