23.2 C
Hyderabad
May 7, 2024 23: 13 PM
Slider ప్రత్యేకం

ఎదురుగాలితో వెనక్కి తిరుగుతున్న ‘‘ఫ్యాన్’’

#jagan

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమాదం అంచున ఉన్నది. మిర్రర్ టుడే ప్రత్యేకం గా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ విషయం వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కనిపించిన నిశ్శబ్ద విప్లవం పూర్తిగా కనుమరుగైపోయిందని, జగన్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేక కనిపిస్తున్నట్లు వెల్లడైంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న మొత్తం 34 నియోజకవర్గాలలో కనీసం 25 సీట్లలో వైసీపీకి నష్టం వాటిల్లుతుంది. విజయనగరం జిల్లా లో 9 సీట్లు ఉంటే వైసీపి రెండు లేదా మూడు సీట్లకు పరిమితం అవుతుంది. పార్వతీ పురం, బొబ్బిలి,విజయనగరం, శృంగవరపుకోట, నెల్లిమర్ల, చీపురుపల్లి,సాలూరులలో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. శ్రీ కాకుళం జిల్లాల్లో మొత్తం 10కి టిడిపికి 6 ,వైసీపికి 4 సీట్లు రావచ్చు. విశాఖలో 5 సీట్లకు 4 టిడిపికి రావచ్చు. రూరల్ విశాఖ జిల్లాలో మూడు , ఏజెన్సీ ప్రాంతంలో 4 సీట్లు వైసీపీకి ఎదురుగాలి స్పష్టంగా కనిపిస్తున్నది.

ఉత్తరాంధ్ర మంత్రులలో బొత్స సత్యనారాయణ, ధర్మాన మాత్రం గెలుస్తారు. రెండు గోదావరి జిల్లాలలో ఉన్న 34 సీట్లలో టీడీపికి 18 రావచ్చు. ఈ రెండు జిల్లాలలో జనసేనకు 6 సీట్లు రావచ్చు.‌వైసీపి మాత్రం ఇక 5 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. 5 చోట్ల మాత్రమే గట్టి పోటీ వుంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలు ప్రజలు టిడీపి వైపు చూస్తే, టీడీపి నాయకులు ఇంకా భయాందోళనలలో ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో 5 నుంచి 8 గెలుపు టిడిపి వైపు ఉంది. ప్రకాశం జిల్లాలో మానుగుంట మహీధర్ రెడ్డి వ్యక్తి గతంగా ముందంజలో ఉన్నారు. పార్టీ తో నిమిత్తం లేకుండా గెలుపు ఉంటుంది. మార్కాపురం గిద్దలూరు దర్శి, నియోజకవర్గాల లో టీడీపీకి అనుకూలంగా ఉంది. ఒంగోలులో బాలినేనికి వ్యతిరేకంగా ఉంది.

నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, కావలి,కోవూరు, నెల్లూరు అర్బన్,రూరల్, గూడూరు వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. వెంకటగిరి 50 శాతం మహిళలు ఎమ్మెల్యే కు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ బలహీనంగావుంది. అనంతపురం జిల్లాలో 8 సీట్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే 3 అనుకూలంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా లో 7, కడపజిల్లా లో నాలుగు సీట్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉంటే కర్నూలు జిల్లా లో 7 సీట్లు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నా యి.

ఈ అంచనాలన్నీ పార్టీ పరంగా, ప్రభుత్వ వ్యతిరేకత పరంగా వేసినవి. ఈ రెండు అంశాలకు తోడు వైసీపీలో దారుణంగా పెరిగిపోయిన ముఠా తగాదాలు పార్టీకి మరింత చెరుపు చేస్తాయి. ముఠా తగాదాలు, పార్టీలోనే వెన్నుపోట్లకు ఆస్కారం ఉండటం అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే జగన్ పార్టీకి నష్టం మరింత నష్టం ఉంటుంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే అంశం ఆధారంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిపినా కూడా ఇప్పటికే జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే స్థితిలో జగన్ పార్టీ లేదు. పార్టీలోని విభేదాలు సరిదిద్దుకునే యంత్రాంగం ఆ పార్టీకి లేదు. అందువల్ల నష్ట నివారణ చర్యలు చేపట్టడం కూడా కష్టమే.

Related posts

ప్రతి ఒక్కరి మేలుకోసమే జగనన్న సురక్ష కార్యక్రమం

Bhavani

హుజుర్ నగర్ పట్టణంలోపర్యటించిన శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

ఇరాన్ ఇన్ ట్రబుల్: కరోనా కాటు అమెరికా ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment