29.7 C
Hyderabad
May 4, 2024 03: 31 AM
Slider విజయనగరం

విజయనగరం ఖాకీలలో పెల్లుబుకుతున్న సేవా దృక్పథం…!

#vijayanagarampolice

గడచిన రెండేళ్ల నుంచీ విజయనగరం జిల్లా పోలీసులకు ఖాకీ దుస్తులు ధరించి విధులతో పాటు సేవా దృక్పథం కూడా అలవడుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలతో పాటు, పంచాయతీ ఎన్నికల సందర్భంలో పోలీసులు కనబరచిన సేవలతో ఇంతవరకు వాళ్లపై ఉన్న అపోహలను చేసిన సేవా గుణాలతో ప్రజలతో పాటు శాఖా ఉన్నతాథికారులకు కనువిప్పు చేసారు.

కొత్త ఎస్పీ వచ్చి చార్జి తీసుకున్న…పోలీసులంటే ‘ఖాకీల’పై ఉన్న అపోహలను పటాపంచ్ లు చేసారు. తాజాగా అలాంటి ఘటనే జిల్లా కేంద్రంలో జరిగింది. పోగొట్టుకున్న బ్యాగు, లక్ష విలువైన వస్తువులు అప్పగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్. నగరంలో ని లయన్స్ క్లబ్ వద్ద రోడ్డు పైన ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.సురేష్ కి  ఒక హ్యాండ్ బ్యాగ్ దొరకగా, వాటిని పరిశీలించగా, సదరు బ్యాగులో ఒక తులం బంగారం హారం, 16 తులాల వెండి పట్టీలు, 4 వేలు నగదు, 10 వేలు విలువైన మొబైల్, ATM కార్డులు, మొత్తం సుమారు ఒక లక్ష విలువైన వస్తువులు ఉన్నాయి.

విషయాన్ని ట్రాఫిక్ డీఎస్పీ ఉత్తర్వులు మేరకు విచారణ చేసి, సదరు హ్యాండ్ బ్యాగు రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు లో జూనియర్ సహాయకులుగా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ భార్యదిగా గుర్తించి, వారికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ అప్పగించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ సేవాధృక్పధం తెలిసి ఎస్పీ దీపికా పాటిల్ సిబ్బంది ని అభినందించారు.

Related posts

సెల్ఫ్ క్వారంటైన్ నుంచి జంప్ అయిన ఎన్నారై లపై క్రిమినల్ కేసు

Satyam NEWS

హాట్ టాపిక్ గా బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని

Satyam NEWS

గుడిసెల్లో బతుకుతున్నవారిని రోడ్డున పడేసిన కేసీఆర్

Satyam NEWS

Leave a Comment