40.2 C
Hyderabad
April 28, 2024 16: 43 PM
Slider వరంగల్

నిరుపేద యువతి వివాహానికి చేయూతనందించిన తస్లీమా

#taslima

నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన యువతి వివాహానికి చేయూతనందించి ఉదారత చాటుకున్నారు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. వెంకటాపూర్ మండల కేంద్రానికి గౌసియా అనే యువతి వివాహానికి సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో బీరువా అందించారు.

గ్రామానికి చెందిన మహమ్మద్ షాబీర్,తహెర దంపతులకు 5 ఐదుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించేవారు. గత 12 సంవత్సరాల క్రితం షాబీర్ మరణించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయింది. ఉండడానికి ఇల్లు లేక గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువు సమీపంలోని కాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసుకొని నివసిస్తున్నారు.

తల్లి తహెర కూలీ పనులు చేసుకుంటూ 3 ముగ్గురు అమ్మాయిల పెళ్ళి చేశారు. నాలుగో సంతానమైన గౌసియా వివాహం  చేయడానికి ఇబ్బందులు పడ్డారు. నిరుపేద యువతి వివాహానికి సాయం చేయండి అని సోషల్ మీడియాలో చూసిన తస్లీమా వెంటనే స్పందించారు.  

బుధవారం సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో బీరువా అందించిన తస్లీమా ఉదారత చాటుకున్నారు. ఆమె వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు మామిడి పెల్లి రమేష్,చంటి సామ్యూల్,చంటి అనిల్,మహమ్మద్ జహీర్, ఆంకూస్, జాకీర్, అఖిల్,తిరుపతి, జాన్, అశోక్, బన్ని, ప్రవీణ్, వివేక్, అనిల్ తదితరులు ఉన్నారు.

Related posts

యూరియా కోసం రైతుల పడిగాపులు

Satyam NEWS

సింగరేణి లాభాల్లో 29 శాతం కార్మికులకు బోనస్

Satyam NEWS

వనపర్తి జిల్లాలో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు

Satyam NEWS

Leave a Comment